జగన్ హయాంలో వ్యవసాయానికి తీరని నష్టం: అచ్చెన్నాయుడు
ABN , Publish Date - Apr 08 , 2026 | 02:25 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో వ్యవసాయానికి తీరని నష్టం జరిగిందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలోని ఐదేళ్లలో గోదావరి జిల్లాల్లో కాలువలో కనీసం మట్టి కూడా ఎందుకు తీయలేదని ప్రశ్నించారు.
పశ్చిమగోదావరి జిల్లా , ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో వ్యవసాయానికి తీరని నష్టం జరిగిందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలోని ఐదేళ్లలో గోదావరి జిల్లాల్లో కాలువలో కనీసం మట్టి కూడా ఎందుకు తీయలేదని ప్రశ్నించారు. ఈరోజు(బుధవారం) పశ్చిమగోదావరి జిల్లాలో అచ్చెన్నాయుడు పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
వైసీపీ హయాంలో అన్నదాతలు చేసేదేమీ లేక క్రాప్ హాలిడే ప్రకటించారని ప్రస్తావించారు. జగన్ దుర్మార్గుడు.. రూ.12 లక్షల కోట్లు అప్పు చేసి పోయారని ధ్వజమెత్తారు. దుర్మార్గుడు జగన్ చేసిన అప్పులకు తమ ప్రభుత్వం వడ్డీ కడుతోందని చెప్పుకొచ్చారు. రానున్న రోజుల్లో వ్యవసాయ కాలువలను ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో జగన్ పోలవరాన్ని ముంచేశారని ఆగ్రహించారు. దిక్కుమాలిన పేపర్, దిక్కుమాలిన టీవీతో పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ అండ్ కోకు దమ్ము ధైర్యం ఉంటే రావాలని.. ఐదేళ్లలో వ్యవసాయానికి ఎంత ఖర్చు పెట్టారో మాట్లాడుదామని అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై దాడులు తగవు.. వైసీపీపై పవన్ కల్యాణ్ ధ్వజం
నిజాలు మాట్లాడితే భౌతిక దాడులా.. వైసీపీపై రామ్మోహన్ ధ్వజం
ఉన్నత విద్యపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News