Share News

ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై దాడులు తగవు.. వైసీపీపై పవన్ కల్యాణ్ ధ్వజం

ABN , Publish Date - Apr 07 , 2026 | 02:25 PM

హైదరాబాద్‌లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నేతల దాడి యత్నాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. వైసీపీ నేతల చర్యలపై ఏబీఎన్ సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ చేసిన విశ్లేషణను జీర్ణించుకోలేక.. జగన్ పార్టీ నేతలు దాడులకు దిగడం అప్రజాస్వామికమని వ్యాఖ్యానించారు.

ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై దాడులు తగవు.. వైసీపీపై పవన్ కల్యాణ్ ధ్వజం
Pawan Kalyan

అమరావతి, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy) కార్యాలయంపై వైసీపీ నేతల దాడి యత్నాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తీవ్రంగా ఖండించారు. వైసీపీ నేతల చర్యలపై ఏబీఎన్ సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ చేసిన విశ్లేషణను జీర్ణించుకోలేక.. జగన్ పార్టీ నేతలు దాడులకు దిగడం అప్రజాస్వామికమని వ్యాఖ్యానించారు. వ్యాఖ్యలు నచ్చకపోతే ప్రజాస్వామ్యరీతిలో సమాధానం ఇవ్వాలని అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా టీడీపీ ఆఫీస్‌లపై దాడులు చేసి విధ్వంసం సృష్టించిందని పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


కాగా, మావిగన్ ఊబి నుంచి బయటపడేందుకు వైసీపీ నేతలు కుయుక్తులు పన్నారు. ఈ క్రమంలోనే ఏబీఎన్- ఆంధ్రజ్యోతి కార్యాలయం దగ్గర వైసీపీ నేతలు ఈరోజు (మంగళవారం) ఆందోళన చేపట్టారు. ఈ ధర్నాలో వైసీపీ నేతలు అంబటి రాంబాబు, జోగి రమేశ్, కాకాణి గోవర్ధన్ రెడ్డి, మార్గాని భరత్, మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేశ్, విశ్వరూప్, శంకర్ నారాయణ, లేళ్ల అప్పిరెడ్డి, రమేశ్ యాదవ్, నేదురుమల్లి, గురుమూర్తి, రామసుబ్బారెడ్డి, సురేశ్, కల్పలతారెడ్డి, కుంభా రవిబాబు, చంద్రశేఖర్, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, లక్ష్మీపార్వతి తదితరులు పాల్గొన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లక్ష్యంగా వికృత క్రీడలకు దిగారు. కార్యాలయం లోపలకు చొచ్చుకెళ్లేందుకు వైసీపీ నేతలు యత్నించారు. ఈక్రమంలో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, వైసీపీ నేతలకు మధ్య తోపులాట జరిగింది. రోడ్డుపై వాహనదారులకు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులకు వైసీపీ నేతలు ఆటంకం కలిగించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఫ్యాక్షన్ బెదిరింపులకు భయపడే వ్యక్తి రాధాకృష్ణ కాదు: మంత్రి లోకేశ్

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడిని ఖండించిన సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Apr 07 , 2026 | 03:17 PM