Share News

ఫ్యాక్షన్ బెదిరింపులకు భయపడే వ్యక్తి రాధాకృష్ణ కాదు: మంత్రి లోకేశ్

ABN , Publish Date - Apr 07 , 2026 | 12:50 PM

ఇవాళ హైదరాబాద్‌లోని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయం దగ్గర వైసీపీ శ్రేణులు తీవ్ర ఆందోళనకు దిగారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లక్ష్యంగా ఆందోళనకారులు వికృత క్రీడలు సాగించారు. ఈ దాడులను విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు.

ఫ్యాక్షన్ బెదిరింపులకు భయపడే వ్యక్తి రాధాకృష్ణ కాదు: మంత్రి లోకేశ్
Nara Lokesh response to YCP

అమరావతి, ఏప్రిల్ 07: 'వీకెండ్ కామెంట్ బై ఆర్కే’ కథనంపై వైసీపీ రాద్ధాంతం చేసింది. ఇవాళ(మంగళవారం) ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయం దగ్గర వైసీపీ శ్రేణులు తీవ్ర ఆందోళనకు దిగారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లక్ష్యంగా ఆందోళనకారులు వికృత క్రీడలు సాగించారు. ఈ దాడులను విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. ఫ్యాక్షన్ బెదిరింపులకు ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ భయపడే వ్యక్తి కాదని లోకేశ్ అన్నారు.


మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. 'జగన్ కళ్లలో ఆనందం చూడటం కోసం వైసీపీ రౌడీ మూకలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడికి ప్రయత్నించడం ఆ పార్టీ విష సంస్కృతిని మరోసారి బయటపెట్టింది. నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే దమ్మున్న ఛానల్ ఏబీఎన్-ఆంధ్రజ్యోతిపై వైసీపీ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. సాక్షి హైదరాబాద్ ఆఫీస్‌కు ఆంధ్రజ్యోతి ఎంత దూరమో.. ఆంధ్రజ్యోతికి సాక్షి కూడా అంతే దూరంలో ఉంది అన్న సంగతి మర్చిపోవద్దు జగన్. మీడియా కథనాల పట్ల నిరసనలు తెలియజేసే పద్ధతి ఇది కాదు' అని లోకేశ్ అన్నారు.


'మీలాంటి ఫ్యాక్షన్ పాలిటిక్స్‌కు ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ భయపడే రకం కాదు. మీ నాన్నగారు ఆంధ్రజ్యోతి కార్యాలయం పైకి బుల్డోజర్లు పంపించినా ఏబీఎన్ ఆర్కే వెనక్కి తగ్గలేదు. మీ నాన్నగారు పంపిన బుల్డోజర్లే వెనక్కి వెళ్లాయి. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం అయిన మీడియా ప్రశ్నిస్తే జవాబు చెప్పాలి. కథనం ప్రచురిస్తే ఆధారాలతో ఖండించాలి. కథనం ప్రసారం చేస్తే తప్పయితే తప్పని చెప్పగలగాలి. ఇవేవీ మీ దగ్గర లేనప్పుడు ఇలాంటి దుర్మార్గపు దాడులకు తెగబడటం అలవాటుగా మార్చుకున్నారు. ఇది తప్పు జగన్ గారు.. జనం ఛీకొట్టినా మారకపోతే ఎలా? మీ వెనక గూండాలు ఉండొచ్చు.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెనుక, ముందు ప్రజలు ఉన్నారు' అంటూ జగన్‌పై మంత్రి లోకేశ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.


ఇవి కూడా చదవండి..

ఆంధ్రుల కలల రాజధాని అమరావతి అన్ స్టాపబుల్

ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ఆసుపత్రుల సమ్మె విరమణ

Updated Date - Apr 07 , 2026 | 01:42 PM