Share News

ఆంధ్రుల కలల రాజధాని అమరావతి అన్ స్టాపబుల్

ABN , Publish Date - Apr 07 , 2026 | 07:46 AM

ఆంధ్రుల కలల రాజధాని అమరావతి అన్ స్టాపబుల్ అని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. మా రాజధాని అమరావతి అని ప్రతి తెలుగువాడు గర్వంగా చెప్పుకునే రోజులు వచ్చాయని అన్నారు.

ఆంధ్రుల కలల రాజధాని అమరావతి అన్ స్టాపబుల్
Amaravati Capital News

అమరావతి: రాజధాని అభివృద్ధిపై మంత్రి కొలుసు పార్థసారథి కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదున్నర కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి ఇక అన్ స్టాపబుల్ అని స్పష్టం చేశారు. 'మా రాజధాని అమరావతి' అని ప్రతి తెలుగువాడు గర్వంగా చెప్పుకునే రోజులు వచ్చాయని అన్నారు.


అలాగే, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అమరావతి బిల్లుకు ఇచ్చిన ఆమోదం.. ప్రతి తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని మంత్రి తెలిపారు. ఈ నిర్ణయం ప్రజల్లో నమ్మకం, ధైర్యాన్ని పెంచిందని ఆయన పేర్కొన్నారు. గత ఐదేళ్లలో అమరావతి అంశంపై ఎదురైన విమర్శలు, ఎగతాళి ఇప్పుడు ముగిసిపోయాయని ఆయన అన్నారు. ఇకపై ఎవరు అడిగినా 'మా రాజధాని అమరావతి' అని ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.


రాష్ట్రపతి ఇచ్చిన ఆమోదం కేంద్ర ప్రభుత్వం తెలుగు ప్రజలపై చూపుతున్న చిత్తశుద్ధి, ప్రేమ, గౌరవానికి నిదర్శనమని మంత్రి అభిప్రాయపడ్డారు. అమరావతిని శాశ్వత రాజధానిగా నిలబెట్టే ఈ గొప్ప కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం తనకు గర్వకారణమని తెలిపారు. చివరిగా, తెలుగు ప్రజలందరూ ఒక్కటై 'జయహో అమరావతి.. జయ జయహో అమరావతి' అనే నినాదంతో ముందుకు సాగాలని మంత్రి పిలుపునిచ్చారు.


ఇవి కూడా చదవండి:

విధ్వంసం, అహంకారం జగన్‌ నైజం: యనమల

రాజకీయ ఉనికి కోసం వైసీపీ నాయకుల పాట్లు

Updated Date - Apr 07 , 2026 | 07:51 AM