రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపిన సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Apr 07 , 2026 | 07:28 AM
అమరావతి రాజధానికి చట్టబద్దత కల్పిస్తూ గెజిట్ విడుదలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు.
అమరావతి, ఏప్రిల్ 07: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టపరమైన గుర్తింపు పొందింది. ఏపీ పునర్విభజన చట్టం-2014ను సవరిస్తూ కేంద్ర హోంశాఖ ప్రవేశపెట్టిన బిల్లును పార్లమెంటు ఉభయసభలు ఈ నెల 1, 2 తేదీల్లో ఆమోదించిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సోమవారం సంతకం చేశారు. అమరావతి రాజధానికి చట్టబద్దత కల్పిస్తూ గెజిట్ విడుదలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. 'మన రాజధాని చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) చట్టం, 2026కు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను' అని సీఎం చంద్రబాబు ఎక్స్ లో పేర్కొన్నారు.
'మన రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉండి, దిశానిర్దేశం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి, ఈ బిల్లుకు మద్దతు తెలిపిన ఎంపీలందరికీ, మా వెన్నంటే నిలిచిన ప్రతి పౌరునికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం. ముఖ్యంగా అమరావతి రైతుల విజయం' అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
విధ్వంసం, అహంకారం జగన్ నైజం: యనమల
రాజకీయ ఉనికి కోసం వైసీపీ నాయకుల పాట్లు