Share News

ఈగల్‌ ఐజీ ఆకే రవికృష్ణ లాగిన్‌ ఐడీలో జగన్‌ పేరు

ABN , Publish Date - Apr 07 , 2026 | 06:20 AM

వైఎస్‌ జగన్‌ అధికారం కోల్పోయి దాదాపు రెండేళ్లవుతోంది. అయినప్పటికీ తిరుపతిలో సోమవారం జరిగిన పోలీసుశాఖ డ్రగ్స్‌ అవగాహన కార్యక్రమంలో...

ఈగల్‌ ఐజీ ఆకే రవికృష్ణ లాగిన్‌ ఐడీలో జగన్‌ పేరు

  • వర్చువల్‌ మీటింగ్‌లో స్ర్కీన్‌పై ప్రత్యక్షమైన వైనం

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): వైఎస్‌ జగన్‌ అధికారం కోల్పోయి దాదాపు రెండేళ్లవుతోంది. అయినప్పటికీ తిరుపతిలో సోమవారం జరిగిన పోలీసుశాఖ డ్రగ్స్‌ అవగాహన కార్యక్రమంలో ఈగల్‌ ఐజీ ఆకే రవికృష్ణ లాగిన్‌ ఐడీలో.. ఇంకా మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పేరు ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. వాస్తవానికి ఆకే రవికృష్ణ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సి ఉంది. కానీ.. ఆయన వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన లాగిన్‌ ఐడిలో మాజీ సీఎం జగన్‌ పేరు ప్రత్యక్షం కావడంతో అందరూ అవాక్కయ్యారు. అయితే.. ఆయన లాగిన్‌లో జగన్‌ పేరు ఎలా వచ్చిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనే అధికారులు లాగిన్‌ ఐడీగా తమ పేర్లుగానీ, సంబంధిత శాఖల పేర్లు గానీ పెట్టుకుంటారు. దీనికి భిన్నంగా ఆకే రవికృష్ణ లాగిన్‌ ఐడీ జగన్మోహన్‌ రెడ్డి పేరుతో డిస్‌ప్లే కావడం చర్చనీయాంశంగా మారింది.

Updated Date - Apr 07 , 2026 | 06:21 AM