ఏపీలో నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం: మంత్రి రవికుమార్
ABN , Publish Date - Apr 08 , 2026 | 11:36 AM
ఏపీలో నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ వ్యాఖ్యానించారు. రైతులకు ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని సీఎం చంద్రబాబు తమను ఆదేశించారని పేర్కొన్నారు.
విజయవాడ, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): ఏపీలో నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ (AP Minister Ravikumar) వ్యాఖ్యానించారు. రైతులకు ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని సీఎం చంద్రబాబు తమను ఆదేశించారని పేర్కొన్నారు. కరెంట్ ఛార్జీలు పెంచకూడదని, సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండొద్దని సీఎం ఉద్దేశమని చెప్పుకొచ్చారు. ఈరోజు(బుధవారం) విజయవాడలోని గుణదల విద్యుత్ సౌధలో నూతన కార్యాలయాన్ని మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
శరవేగంగా సబ్ స్టేషన్స్ నిర్మాణాలు..
గుణదల విద్యుత్ సౌధలో నూతన కార్యాలయం ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అందరి కృషి కారణంగానే విద్యుత్ శాఖకు మంచి పేరు వచ్చిందని అన్నారు. నూతన సబ్ స్టేషన్స్ నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని స్పష్టం చేశారు.
సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారు..
విపత్తుల సమయాల్లో మన విద్యుత్ శాఖ అధికారుల పని తీరు అభినందనీయమని అన్నారు. గంటల వ్యవధిలోనే విపత్తు తర్వాత విద్యుత్ సరఫరా, స్తంభాలు ఏర్పాటు చేయడంలో సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. ప్రజలకు ఇంకా మంచి సేవలు అందించాలని సిబ్బందిని కోరారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా విద్యుత్ శాఖ పని చేస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై దాడులు తగవు.. వైసీపీపై పవన్ కల్యాణ్ ధ్వజం
నిజాలు మాట్లాడితే భౌతిక దాడులా.. వైసీపీపై రామ్మోహన్ ధ్వజం
ఉన్నత విద్యపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News