ఏబీఎన్‌పై ఆగని వైసీపీ కుట్రలు.. మరోసారి నిరసనలకు పిలుపు
ABN, Publish Date - Apr 07 , 2026 | 05:25 PM
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలపై వైసీపీ అరాచకాలు ఆగడం లేదు. బుధవారం ఏపీ వ్యాప్తంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాల వద్ద నిరసన వ్యక్తం చేయాలని ఆ పార్టీ నేతలకు ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది.
అమరావతి,ఏప్రిల్7 (ఆంధ్రజ్యోతి): ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhra Jyothy) సంస్థలపై వైసీపీ (YSRCP) అరాచకాలు ఆగడం లేదు. రేపు(బుధవారం) ఏపీ వ్యాప్తంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాల వద్ద నిరసన వ్యక్తం చేయాలని ఆ పార్టీ నేతలకు ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. వైసీపీకి సంబంధించి ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులకు ఫోన్‌లు చేసి, టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆ పార్టీ రాష్ట్ర నేతలు చెప్పినట్లు సమాచారం. ఈ రోజు(మంగళవారం) హైదరాబాద్‌లోని ఏబీఎన్ ప్రధాన కార్యాలయంపై వైసీపీ నేతలు దాడికి దిగిన విషయం తెలిసిందే.
బుధవారం కూడా ఈ కార్యక్రమం కొనసాగించాలని వైసీపీ హై కమాండ్ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే జిల్లా నేతలకు వైసీపీ హై కమాండ్ ఫోన్‌లు చేసి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. మావిగాన్‌పై వచ్చిన వ్యతిరేకత నుంచి బయటపడేందుకు వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్‌కి తెరదీసినట్లు తెలుస్తోంది. ప్రజలు ఛీ కొడుతున్నా మారని వైసీపీ నేతల వక్రబుద్ధి అంటూ రాజకీయ పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారు. అలాగే, జర్నలిజం విలువలను మంటగలుపుతున్నారని జర్నలిస్ట్ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
ఫ్యాక్షన్ బెదిరింపులకు భయపడే వ్యక్తి రాధాకృష్ణ కాదు: మంత్రి లోకేశ్
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడిని ఖండించిన సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telangana News And International News And Telugu News
Updated at - Apr 07 , 2026 | 05:36 PM