Share News

ఇలా చేస్తే ఉపేక్షించేది లేదు.. టీడీపీ నేతలపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం

ABN , Publish Date - Apr 08 , 2026 | 04:06 PM

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బుధవారం టీడీపీ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆ పార్టీ నేతలపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలా చేస్తే ఉపేక్షించేది లేదు.. టీడీపీ నేతలపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం
AP Minister Nara Lokesh

అమరావతి, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) ఈరోజు(బుధవారం) టీడీపీ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆ పార్టీ నేతలపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేడర్ సమావేశాలు, గ్రీవెన్స్ వరుసగా నాలుగు వారాలు నిర్వహించని పలువురు నాయకులను నారా లోకేశ్ మందలించారు.


మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి వరుసగా నాలుగు వారాలు కేడర్ సమావేశాలు, గ్రీవెన్స్ నిర్వహించకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఆయా కార్యక్రమాలు నిర్వహించకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకోవాలని పార్టీ కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. నాలుగు వారాల నుంచి కేడర్ సమావేశాలు నిర్వహించని పులివెందుల ఇన్‌చార్జ్ బీటెక్ రవి, కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి, నాలుగు వారాల నుంచి గ్రీవెన్స్ నిర్వహించని ధర్మవరం ఇన్‌చార్జ్ పరిటాల శ్రీరామ్ పట్ల నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు కచ్చితంగా నిర్వహించాలని లోకేశ్ హుకుం జారీ చేశారు. ఇకముందు ఇలానే వ్యవహారిస్తే ఉపేక్షించేది లేదని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.


పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి..

కష్టపడిన వారిని గుర్తించాలనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమని మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు. నేతల పనితీరే ఇక్కడి వరకు రావడానికి కారణమని చెప్పారు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను సక్రమంగా నిర్వహిస్తే పార్టీ వందేళ్లు ఉంటుందని తెలిపారు. ‘మై టీడీపీ యాప్’ టాప్ 10 ఫెర్ఫార్మర్స్‌తో మంత్రి లోకేశ్ ఆత్మీయ భేటీ అయ్యారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. యాప్ సమర్థ వినియోగం పట్ల ఉత్తమ కార్యకర్తలను లోకేశ్ ఘనంగా సత్కరించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై దాడులు తగవు.. వైసీపీపై పవన్ కల్యాణ్ ధ్వజం

నిజాలు మాట్లాడితే భౌతిక దాడులా.. వైసీపీపై రామ్మోహన్ ధ్వజం

ఉన్నత విద్యపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Apr 08 , 2026 | 04:32 PM