‘మావిగన్ జోకర్’గా జగన్ మిగిలారు.. షర్మిల సెటైర్లు
ABN , Publish Date - Apr 09 , 2026 | 02:29 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. వైఎస్సార్ తన జీవిత కాలం వ్యతిరేకించిన బీజేపీకి దత్తపుత్రుడుగా జగన్ మారారని ఎద్దేవా చేశారు.
అమరావతి, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు షర్మిల (YS Sharmila) షాకింగ్ కామెంట్స్ చేశారు. వైఎస్సార్ తన జీవిత కాలం వ్యతిరేకించిన బీజేపీకి దత్తపుత్రుడుగా జగన్ మారారని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో మూడు రాజధానుల పేరుతో రుషికొండ మింగేసి సొంతానికి ప్యాలెస్‌లు కట్టుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ‘మావిగన్ జోకర్’గా జగన్ మిగిలారని సెటైర్లు గుప్పించారు. సంక్షేమానికి సారథి దివంగత నేత వైఎస్సార్ అని కొనియాడారు. ఆయన ప్రతీ పథకం ప్రజల కష్టం, కన్నీళ్ల నుంచి పుట్టిందేనని వ్యాఖ్యానించారు. ఈ మేరకు షర్మిల ఓ ప్రకటన విడుదల చేశారు.
వైఎస్సార్ ప్రజాప్రస్థానం పదిలం..
కాంగ్రెస్ నాయకుడు, మా నాన్న వైఎస్సార్ ప్రజాప్రస్థానం తెలుగు ప్రజల గుండెల్లో ఈరోజుకి పదిలమని షర్మిల చెప్పుకొచ్చారు. ఏప్రిల్ 9, 2003లో చేవెళ్ల నుంచి ఇచ్చాపురం దాక ప్రజాహితమే పరమావధిగా వైఎస్సార్ చేపట్టిన1457 కిలోమీటర్ల పాదయాత్ర సాగిందని తెలిపారు. ఈ పాదయాత్రకు 23 ఏళ్లని చెప్పారు. వారసులమని చెప్పుకునే జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ పేరును వాడుకున్నారు తప్పితే.. ఆయన ఆశయాలకు వారసులు ఎందుకు కాలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. వైసీపీలో నిజంగా వైఎస్సార్ ఐడియాలజీ ఉంటే జగన్ సీఎం అయ్యాక కూడా వైఎస్సార్ జలయజ్ఞాన్ని ఎందుకు పూర్తి చేయలేదు..? అని నిలదీశారు. ‘మాట తప్పం మడమ తిప్పం’ అనే వైఎస్సార్ లైన్ వాడుకోవడం తప్పిస్తే, పూర్తి మద్యపాన నిషేధమని మాట ఇచ్చి, కల్తీ మద్యం అమ్మి ‘ఓన్లీ క్యాష్’ మాఫియా ఎందుకు చేశారు? అని షర్మిల ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఇలా చేస్తే ఉపేక్షించేది లేదు.. టీడీపీ నేతలపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం
జగన్ హయాంలో వ్యవసాయానికి తీరని నష్టం: అచ్చెన్నాయుడు
రహదారుల నిర్వహణ పటిష్ఠంగా ఉండాలి: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telangana News And International News And Telugu News