Share News

రెయిన్ అలర్ట్.. మరో మూడు గంటల్లో పిడుగుపాటుతో కూడిన వర్షం..

ABN , Publish Date - Apr 10 , 2026 | 03:02 PM

రాబోయే మూడు గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాతావరణం మారే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

రెయిన్ అలర్ట్.. మరో మూడు గంటల్లో పిడుగుపాటుతో కూడిన వర్షం..
Rain Alert

అమరావతి, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): రాబోయే మూడు గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాతావరణం మారే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈరోజు (శుక్రవారం) ఓ ప్రకటన విడుదల చేశారు. ఉత్తరాంధ్ర, మన్యం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం (Rain Alert) పడే అవకాశం ఉందని హెచ్చరించారు.


ముఖ్య ప్రాంతాలు - హెచ్చరికలు..

రాగల మూడు గంటల్లో ఈ క్రింది జిల్లాల్లో ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని తెలిపారు. ప్రధానంగా విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే వీలుందని చెప్పుకొచ్చారు. వాతావరణంలో మార్పులు గమనించిన వెంటనే అప్రమత్తమవ్వడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టాలను అడ్డుకోవచ్చని తెలిపారు. రైతులు, కూలీలు, బహిరంగ ప్రదేశాల్లో ఉండేవారు వాతావరణ శాఖ ఇచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని ప్రఖర్ జైన్ కోరారు.


ప్రజలకు భద్రతా సూచనలు..

పిడుగులు, ఈదురు గాలుల సమయంలో ప్రమాదాలను నివారించడానికి ప్రఖర్ జైన్ ఈ సూచనలు చేశారు.

సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి: వర్షం లేదా పిడుగులు పడుతున్నప్పుడు బయట తిరగవద్దని సూచించారు.

చెట్ల కింద నిలబడొద్దు: పిడుగులు పడే సమయంలో చెట్ల కింద ఆశ్రయం పొందడం అత్యంత ప్రమాదకరమని తెలిపారు. పొలాల్లో ఉన్నవారు కూడా వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

విద్యుత్ స్తంభాలకు దూరం: విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, తీగలు లేదా ఇనుప కంచెలకు దూరంగా ఉండాలని చెప్పారు.

పశువుల సంరక్షణ: గాలివాన సమయంలో పశువులను, గొర్రెలను బయట చెట్లకు కట్టేయకుండా సురక్షితమైన పాకల్లో ఉంచాలని పేర్కొన్నారు.

ప్రయాణాలు వాయిదా: ఈదురు గాలుల తీవ్రత ఎక్కువగా ఉన్నందున వాహనాలపై ప్రయాణించే వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

‘మావిగన్ జోకర్’‌గా జగన్ మిగిలారు.. షర్మిల సెటైర్లు

మీడియాపై దాడులకు పాల్పడటం సరికాదు: వెంకయ్య నాయుడు

పాదయాత్ర కాదు..‌ మోకాళ్ల యాత్ర చేసినా జగన్‌ను ప్రజలు నమ్మరు: బుద్దా వెంకన్న

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Apr 10 , 2026 | 03:06 PM