Share News

చట్టాలు, న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరిగింది: అనిత

ABN , Publish Date - Apr 11 , 2026 | 01:34 PM

చట్టాలు, న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరిగిందని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ అంటే ఒక గౌరవమని ఉద్ఘాటించారు.

 చట్టాలు, న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరిగింది: అనిత
Home Minister Anitha

విశాఖపట్నం, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): చట్టాలు, న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరిగిందని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Anitha) వ్యాఖ్యానించారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ అంటే ఒక గౌరవమని ఉద్ఘాటించారు. పోక్సో కేసుల్లో బెయిల్ రాకుండానే శిక్ష పడుతుందని స్పష్టం చేశారు. పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ సమన్వయంతో పని చేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఈరోజు(శనివారం) విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ ప్రాసిక్యూషన్ విభాగం ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణా, బానిస కార్మిక వ్యవస్థ (రద్దు) చట్టం, 1976పై ఒక రోజు వర్క్‌షాప్ నిర్వహించారు.


900 మంది పిల్లలను రక్షించాం..

ఈ వర్క్‌షాప్‌కు ముఖ్యఅతిథిగా హోంమంత్రి అనిత, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ రామకోటేశ్వరరావు, 200 మంది ప్రాసిక్యూషన్ అధికారులు పాల్గొన్నారు. వివిధ కేసుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పబ్లిక్ ప్రాసిక్యూటర్స్‌ను సత్కరించారు. అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడారు. సమాజానికి ఉపయోగపడేది ఈ వర్క్‌షాప్ అని చెప్పుకొచ్చారు. ఆపరేషన్ ట్రేస్‌లో భాగంగా 900 మంది పిల్లలను రక్షించామని వివరించారు. వివిధ దేశాల్లో చిక్కుకున్న180 మందిని కూడా రక్షించామని తెలిపారు. పోలీస్ శాఖలో కూడా నూతన టెక్నాలజీతో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ పటిష్ఠంగా ఉంటేనే.. ప్రజాస్వామ్యం పటిష్ఠంగా ఉంటుందని హోం మంత్రి అనిత పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

వైసీపీ నేత హైటెక్ మోసం.. ఆందోళనలో బాధితులు

స్థానిక ఎన్నికలపై అప్రమత్తంగా ఉండాలి: మంత్రి లోకేశ్

భోగాపురం విమానాశ్రయం.. ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Apr 11 , 2026 | 01:38 PM