వైద్య రంగంలో సమూల మార్పులు: మంత్రి సత్య కుమార్
ABN , Publish Date - Apr 12 , 2026 | 07:40 PM
తమ ప్రభుత్వం వైద్య రంగంలో సమూల మార్పులు తీసుకువస్తోందని మంత్రి సత్య కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వంతో పాటు వివిధ సంస్థలు ప్రజల ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు.
విశాఖపట్నం, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): తమ ప్రభుత్వం వైద్యరంగంలో సమూల మార్పులు తీసుకువస్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ (Minister Satya Kumar Yadav) వ్యాఖ్యానించారు. ప్రభుత్వంతో పాటు వివిధ సంస్థలు ప్రజల ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. ఏపీలో ఆరోగ్యశాఖను మరింత పటిష్ఠం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈరోజు(ఆదివారం) విశాఖపట్నంలో గెయిల్ ఆర్థిక సహాయంతో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీలో డయగ్నోసిస్ సేవలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడారు.
రాష్ట్రంలో రెడ్‌క్రాస్ సొసైటీ అనేక కార్యక్రమాలు చేస్తోందని వెల్లడించారు. గెయిల్ ఆర్థిక సహాయంతో విశాఖపట్నం రెడ్‌క్రాస్ సొసైటీలో డయగ్నోసిస్ సేవలు ప్రారంభించడం శుభ పరిణామమని పేర్కొన్నారు. ఈ డయగ్నోసిస్ సేవలు ఉత్తరాంధ్రవాసులకు ఉపయోగపడతాయని వివరించారు. ఏపీలో తలసీమియా, సికిల్‌సెల్ ఎనీమియాతో బాధపడుతున్నవారు రెండు వేల మందికి పైగా ఉన్నారని మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఘనంగా బసవతారకం ఆస్పత్రి రజతోత్సవ వేడుకలు..
చట్టాలు, న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరిగింది: అనిత
జువ్వలదిన్నె హార్బర్‌పై అసత్య ప్రచారాలు నమ్మొద్దు: సోమిరెడ్డి
Read Latest AP News And Telangana News And International News And Telugu News