Share News

ఏపీలో మోత మోగిస్తున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు

ABN , Publish Date - Apr 14 , 2026 | 08:17 PM

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

 ఏపీలో మోత మోగిస్తున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
Summer Alert

అమరావతి, ఏప్రిల్14 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో భానుడు భగభగలాడుతున్నాడు. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరగనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరించారు. ఏపీ వ్యాప్తంగా ఎండలు ముదురుతున్నాయి. విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో వడగాలుల తీవ్రత జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోంది.


రికార్డు ఉష్ణోగ్రత..

కడప జిల్లా ఒంటిమిట్టలో 45°C అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని 262 మండలాల్లో 40°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రేపు(బుధవారం) ఏపీ వ్యాప్తంగా 46 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 73 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.


జిల్లాల వారీగా ప్రభావం..

శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు దాదాపు 14 జిల్లాల్లో ఎండల ప్రభావం అధికంగా ఉండనుంది. రేపు రాయలసీమ, కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42°C నుంచి 44°C వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఒంటిమిట్ట (కడప)45°C కడప, కర్నూలు, నంద్యాల 44°C, తిరుపతి, నెల్లూరు, అనంతపురం 42°C నమోదైంది.


ప్రభావిత జిల్లాలు..

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కడప, తిరుపతి జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.


ప్రజలకు కీలక సూచనలు..

తీవ్రమైన ఎండలు, ఉక్కపోత దృష్ట్యా విపత్తుల సంస్థ అధికారులు ఈ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని సూచించారు. తరచుగా మంచినీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటివి తీసుకోవాలని అన్నారు. బయటకు వెళ్లాల్సి వస్తే తలపై టోపీ లేదా గొడుగు ధరించాలని తెలిపారు. కాటన్ వస్త్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచించారు. రాబోయే రెండు రోజులు మరింత క్లిష్టంగా ఉండనున్నాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వడదెబ్బ బారి నుంచి తప్పించుకోవచ్చని అన్నారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్నారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరమని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి...

డీ-రెగ్యులేషన్ ఫేజ్-3పై ముందస్తు చర్చలు.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు

జగన్‌వి.. శవ రాజకీయాలు.. మంత్రి అచ్చెన్నాయుడు సెటైర్లు

వివేకా కేసులో కొత్త మలుపు.. తదుపరి దర్యాప్తు కోరుతూ హైకోర్టులో సునీతారెడ్డి పిటిషన్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Apr 14 , 2026 | 08:22 PM