Home » Summer health Tips
ఏపీలో రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వ్యాఖ్యానించారు. ద్రోణి ప్రభావంతో కోస్తా, రాయలసీమలో వర్షం పడే సూచనలు ఉన్నాయని తెలిపారు.
దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజలకు ఓ కీలక విజ్ఞప్తి చేశారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత పెరుగుతోందని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా హీట్ వేవ్‌పై హై అలర్ట్ ప్రకటించినట్లు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తీవ్ర ఉష్ణోగ్రతలపై మంత్రి పొంగులేటి సచివాలయంలో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ వేసవి సీజన్‌లోనే అత్యధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాబోయే మూడు రోజుల పాటు కోస్తాంధ్ర జిల్లాల్లో ఎండ తీవ్రత మరింత పెరిగి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. పలు జిల్లాల్లో 45°C నుంచి 47°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హెచ్చరించారు.
వేసవి వేడి నుంచి ఉపశమనం కోసం చాలా మంది గంటల తరబడి ఏసీలో గడుపుతున్నారు. అయితే ఎక్కువసేపు ఏసీలో ఉండటం వల్ల శ్వాసకోశ సమస్యలు, చర్మం పొడిబారడం వంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఏసీ గదుల్లో వెంటిలేషన్ లేకపోతే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. తలనొప్పి, అలసట, ఉక్కపోత వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే సరైన వెంటిలేషన్ తప్పనిసరి అని సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మరింత తీవ్రతరం అవుతున్నాయి. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ విడుదల చేసిన తాజా హెచ్చరికల ప్రకారం శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వడగాలుల తీవ్రత అధికంగా ఉండవచ్చని హెచ్చరించారు.
వేసవి అంటేనే ఎండ వేడి. తెల్లవారగానే ఆకాశంలో సూర్యుడు ప్రత్యక్షమవుతున్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సూర్యుడి భగభగలు కారణంగా బయటే కాదు ఇంట్లో కూడా ఉండ లేని పరిస్థితి ఏర్పడుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల వాతావరణ పరిస్థితులపై కీలక హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో ఒకవైపు భానుడి భగభగలు, మరోవైపు అకాల వర్షాలు.. ఇలా విభిన్న వాతావరణం నెలకొందని పేర్కొన్నారు.