Share News

ఏపీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. గడగడలాడుతున్న జనం..

ABN , Publish Date - May 20 , 2026 | 05:26 PM

ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ వేసవి సీజన్‌లోనే అత్యధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 ఏపీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. గడగడలాడుతున్న జనం..
AP Heat wave

అమరావతి, మే 20 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ వేసవి సీజన్‌లోనే అత్యధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 47.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. అలాగే పిడుగురాళ్ల తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు కృష్ణా జిల్లా కంకిపాడు, మార్కాపురం జిల్లా నందనమారెళ్ల ప్రాంతాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ రెండు ప్రాంతాల్లో 46.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇక పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, రాష్ట్రంలోని 11 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి.


ఉదయం నుంచే ఎండ తీవ్రత పెరగడంతో ప్రజలు బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారుల హెచ్చరికల ప్రకారం రానున్న నాలుగు రోజుల పాటు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో అత్యవసర పనులు లేకపోతే బయటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఎండల తీవ్రత కారణంగా వడదెబ్బ ప్రమాదం ఎక్కువగా ఉండటంతో ప్రజలు తరచూ తాగునీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి ద్రవాలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తలకు టోపీ లేదా గుడ్డ కట్టుకుని బయటకు వెళ్లడం మంచిదని చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

జాలర్ల కుటుంబంతో ఆత్మీయంగా గడిపిన సీఎం చంద్రబాబు

కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి ధ్వజం

స్విచ్‌లు నొక్కితే సీఎం కాలేరు.. జగన్‌పై షర్మిల సెటైర్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 20 , 2026 | 06:06 PM