కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి ధ్వజం
ABN , Publish Date - May 19 , 2026 | 04:28 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో దళితులపై జరిగిన దాడులు మర్చిపోలేనివని చెప్పుకొచ్చారు.
కృష్ణాజిల్లా, (మచిలీపట్నం) మే 19 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర (AP Minister Kollu Ravindra) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో దళితులపై జరిగిన దాడులు మర్చిపోలేనివని చెప్పుకొచ్చారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హత్యకు గురైన దళితుడు సుబ్రహ్మణ్యం నాల్గోవర్ధంతి మచిలీపట్నం బలరామునిపేటలోని ఎస్సీ కాలనీలో ఈరోజు (మంగళవారం) జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పాల్లొన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ సెల్ నాయకులు, కాలనీలోని దళిత ప్రముకులతో మంత్రి కొల్లు రవీంద్ర సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
డా. సుధాకర్‌ని పిచ్చోడిని చేసి చంపేశారు..
జగన్ హయాంలో ఒక్క దళితులనే కాదని.. బీసీలు, మైనార్టీలు కూడా పెద్దఎత్తున దాడులకు గురయ్యారని మంత్రి కొల్లు రవీంద్ర ప్రస్తావించారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర డ్రైవర్‌గా పనిచేసిన దళితుడు సుబ్రహ్మణ్యంను డోర్ డెలివరీ చేశారని ధ్వజమెత్తారు. నాడు ఆ కేసును తారుమారు చేసేందుకు జగన్ అనేక ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కేసును నిష్పక్షపాతంగా విచారిస్తుంటే సాక్షులను ట్యాంపర్ చేసే ప్రయత్నాలు చేశారని చెప్పుకొచ్చారు. మాస్క్ అడిగిన పాపానికి డా. సుధాకర్‌ని పిచ్చోడిని చేసి చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛ..
శాండ్‌లో అవినీతి జరుగుతోందని ప్రశ్నించిన ఓం ప్రకాష్‌ను ఉరివేసి చంపేశారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని తెలిపారు. జగన్ హయాంలో హత్యకు గురైన బీసీ సోదరుడు తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించామని అన్నారు. నేడు మళ్లీ జగన్ కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహించారు. అధికారులకు కులాలు అంటగట్టి దూషిస్తున్నారని మండిపడ్డారు. రోడ్డు ప్రమాదంలో ఓ పాస్టర్ చనిపోతే రాజకీయం చేయాలని చూశారని... వీటన్నింటినీ ప్రజలు గమనించాలని కోరారు. అన్నివర్గాలు సంఘటితమై ముందుకు సాగాలని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి...
బుల్లెట్ వేగంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్లాంట్.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
భవిష్యత్తు న్యూక్లియర్ రంగంలో ఏపీ కీలక పాత్ర పోషిస్తుంది: నారా లోకేశ్
భార్యను అడ్డుపెట్టుకొని పేర్ని నాని బతికిపోయారు.. మంత్రి పార్థసారథి షాకింగ్ కామెంట్స్
Read Latest AP News And Telangana News And International News And Telugu News