Share News

భార్యను అడ్డుపెట్టుకొని పేర్ని నాని బతికిపోయారు.. మంత్రి పార్థసారథి షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - May 18 , 2026 | 07:03 PM

మాజీ మంత్రి పేర్నినానిపై మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భార్యను అడ్డంపెట్టుకొని నాని బతికిపోయారని విమర్శించారు.

భార్యను అడ్డుపెట్టుకొని పేర్ని నాని బతికిపోయారు.. మంత్రి పార్థసారథి షాకింగ్ కామెంట్స్
AP Minister Kolusu Parthasarathy

ఏలూరు జిల్లా, మే 18 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి పేర్నినానిపై మంత్రి కొలుసు పార్థసారథి (AP Minister Kolusu Parthasarathy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భార్యను అడ్డుపెట్టుకొని నాని బతికిపోయారని విమర్శించారు. ఈరోజు (సోమవారం) ఏలూరు జిల్లాలో మంత్రి కొలుసు పార్థసారథి పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ నాయకులు పేర్నినాని, జోగి రమేశ్ నూజివీడులో నిర్వహించిన మామిడి రైతుల సదస్సులో చేసిన విమర్శలకు ఘాటుగా పార్థసారథి బదులిచ్చారు.


నాని.. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి..

‘కాంగ్రెస్‌లో ఉంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర రూట్ మ్యాప్ పర్యవేక్షించిన రాజకీయ వ్యభిచారి పేర్ని నాని. భార్యను అడ్డం పెట్టుకొని అవినీతి, బెదిరింపులు, అక్రమాలకు పాల్పడ్డారు. మహిళలను వేధించకూడదని సీఎం చంద్రబాబు చెప్పారు.. అందుకే పేర్ని నాని బతికిపోయారు. నాని ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. అమరావతిపై విషం చిమ్మితే 11 సీట్ల నుంచి సున్నాకు వైసీపీ పడిపోతుంది. ప్రజలతో దొంగ మందు తాగించి అనారోగ్యం పాల్జేసి జగన్ అండ్ కో వేలకోట్లు దోచుకున్నారు’ అని పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

అమరావతిని క్వాంటం టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం: సీఎం చంద్రబాబు

పార్టీ పెట్టి ఉంటే కచ్చితంగా గెలిచేవాడిని: రజనీకాంత్

హైబ్రిడ్ మోడల్‌లో మహానాడు నిర్వహిస్తాం: పల్లా శ్రీనివాసరావు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 18 , 2026 | 07:25 PM