Share News

అమరావతిని క్వాంటం టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - May 17 , 2026 | 12:17 PM

ప్రపంచ టెలికమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. సురక్షిత కమ్యూనికేషన్లు, విశ్వాసనీయ డిజిటల్ మౌలిక సదుపాయాలు, సైబర్ భద్రత భవిష్యత్తు ప్రపంచానికి అత్యంత అవసరమని పేర్కొన్నారు.

అమరావతిని క్వాంటం టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం: సీఎం చంద్రబాబు
AP CM Chandrababu Naidu

అమరావతి, మే11 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ టెలికమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) కీలక ప్రకటన చేశారు. సురక్షిత కమ్యూనికేషన్లు, విశ్వాసనీయ డిజిటల్ మౌలిక సదుపాయాలు, సైబర్ భద్రత భవిష్యత్తు ప్రపంచానికి అత్యంత అవసరమని పేర్కొన్నారు. అమరావతిని క్వాంటం టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా మరో భారీ అడుగు పడిందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం పోస్టు పెట్టారు.


అత్యాధునిక పరిశోధనలు..

ఎస్ఆర్ఎం యూనివర్సిటీ - ఏపీ, సీ - డాట్, భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ల విభాగం, అమరావతి క్వాంటం వ్యాలీ భాగస్వామ్యంతో దేశంలోనే మొట్టమొదటి ‘క్వాంటం-సెక్యూర్ కమ్యూనికేషన్స్ టెస్ట్ బెడ్’ ఏర్పాటు కానుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా కమ్యూనికేషన్స్, సైబర్‌స్పేస్ భద్రత రంగాల్లో అత్యాధునిక పరిశోధనలు చేపట్టనున్నారని అన్నారు. ఏప్రిల్ 14వ తేదీన ప్రారంభించిన క్వాంటం కంప్యూటింగ్ రిఫరెన్స్ ఫెసిలిటీల తర్వాత ఇది మరో కీలక మైలురాయి అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ టెస్ట్ బెడ్ ద్వారా క్వాంటం కమ్యూనికేషన్ హార్డ్‌వేర్, ఫొటోనిక్, ఆప్టికల్ సిస్టమ్స్, ఎన్‌క్రిప్షన్ టెక్నాలజీలు, సురక్షిత నెట్‌వర్క్ మౌలిక సదుపాయాలు, నెక్స్ట్ జనరేషన్ సైబర్ డిఫెన్స్ సొల్యూషన్స్‌పై పరిశోధనలు, పరీక్షలు నిర్వహించనున్నారని వెల్లడించారు.


ప్రపంచస్థాయి కేంద్రంగా అమరావతి..

ఈ కార్యక్రమం ‘మేక్ ఇన్ ఇండియా’ లక్ష్యాలకు అనుగుణంగా స్వదేశీ సాంకేతికతల అభివృద్ధికి ఊతమివ్వనుందని సీఎం వ్యాఖ్యానించారు. ఆధునిక టెక్నాలజీలు, డీప్‌టెక్ ఇన్నోవేషన్, అధునాతన తయారీ రంగాల్లో అమరావతిని ప్రపంచస్థాయి కేంద్రంగా నిలబెట్టడమే ప్రధాన లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని వివరించారు. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్‌లు, యువ ఆవిష్కర్తలకు ఈ ప్రాజెక్ట్ ద్వారా కొత్త అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. భవిష్యత్తు ప్రపంచాన్ని ప్రభావితం చేసే క్వాంటం టెక్నాలజీ, సైబర్ భద్రత రంగాల్లో రాష్ట్ర యువతకు ప్రత్యక్ష భాగస్వామ్యం కల్పించే వేదికగా ఇది నిలవనుందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్‌కు సహకరిస్తున్న అన్నిసంస్థలు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, అధ్యాపకులు, విద్యార్థులు, ఆవిష్కర్తలకు అభినందనలు తెలిపారు. అమరావతి క్వాంటం వ్యాలీ ప్రాజెక్ట్ దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఏఎంసీఏ ప్రాజెక్టు రాయలసీమ అభివృద్ధిలో కీలక మైలురాయి: సీఎం చంద్రబాబు

ఫ్యాక్షన్ రాజకీయాలు తట్టుకుని ఇక్కడివరకొచ్చా.. జగన్ అండ్‌కోకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్

విజయవాడ జీజీహెచ్ ఘటనపై మంత్రి సత్యకుమార్ సీరియస్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 17 , 2026 | 12:30 PM