Share News

హైబ్రిడ్ మోడల్‌లో మహానాడు నిర్వహిస్తాం: పల్లా శ్రీనివాసరావు

ABN , Publish Date - May 17 , 2026 | 01:05 PM

మహానాడు రద్దుపై తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదేశాలతో ఇంధన వనరులు ఆదా చేసుకునే నేపథ్యంలో భాగంగా నెల్లూరులో జరగాల్సిన మహానాడు కార్యక్రమాన్ని రద్దు చేశామని తెలిపారు.

హైబ్రిడ్ మోడల్‌లో మహానాడు నిర్వహిస్తాం: పల్లా శ్రీనివాసరావు
Palla SrinivasaRao

విశాఖపట్నం (గాజువాక), మే 17 (ఆంధ్రజ్యోతి): మహానాడు రద్దుపై తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (Palla SrinivasaRao) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదేశాలతో ఇంధన వనరులు ఆదా చేసుకునే నేపథ్యంలో భాగంగా నెల్లూరులో జరగాల్సిన మహానాడు కార్యక్రమాన్ని రద్దు చేశామని తెలిపారు. ఈరోజు (ఆదివారం) విశాఖపట్నంలో పల్లా శ్రీనివాసరావు పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ ఆలోచనతో, సీఎం చంద్రబాబు ఏకీభవిస్తూ మహానాడును రద్దు చేశారని వెల్లడించారు. కోవిడ్ లాంటి సమయంలో వర్చువల్ మహానాడును ఏర్పాటు చేశామని ప్రస్తావించారు.


ఇప్పుడు మహానాడు కార్యక్రమానికి రూ.5 నుంచి రూ.10 కోట్లు ఖర్చుతో కూడుకున్న విషయమని, అలాగే దాదాపుగా పదివేల వాహనాలు మహానాడుకు చేరుకుంటాయని చెప్పుకొచ్చారు. ఇంధన వనరులు ఆదా చేసుకోవడం కోసం ప్రతి నియోజకవర్గంలో హైబ్రిడ్ మోడల్ మహానాడు నిర్వహిస్తామని వివరించారు. 1848 భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ప్రజలు వీక్షించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ప్రాంగణంలో పార్టీకి చెందిన 68 మంది సీనియర్ నేతలతో కూడిన బృందం మహానాడు సందర్భంగా దిశానిర్దేశం చేస్తారని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఏఎంసీఏ ప్రాజెక్టు రాయలసీమ అభివృద్ధిలో కీలక మైలురాయి: సీఎం చంద్రబాబు

ఫ్యాక్షన్ రాజకీయాలు తట్టుకుని ఇక్కడివరకొచ్చా.. జగన్ అండ్‌కోకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్

విజయవాడ జీజీహెచ్ ఘటనపై మంత్రి సత్యకుమార్ సీరియస్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 17 , 2026 | 01:08 PM