శేషాచలం అటవీ సంపద కాపాడటంలో టీటీడీ కృషి కొనసాగాలి: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - May 18 , 2026 | 03:05 PM
తిరుమలలో 89.4 శాతం అటవీ విస్తీర్ణం సాధించిన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. శేషాచలం అడవుల్లో స్థానిక జాతుల పునరుద్ధరణకు టీటీడీ కృషి చేస్తోందని చెప్పుకొచ్చారు.
అమరావతి, మే 18 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో 89.4 శాతం అటవీ విస్తీర్ణం సాధించిన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) అభినందనలు తెలిపారు. శేషాచలం అడవుల్లో స్థానిక జాతుల పునరుద్ధరణకు టీటీడీ కృషి చేస్తోందని చెప్పుకొచ్చారు. అటవీ సంపద పరిరక్షణకు చేపట్టిన చర్యలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. ప్రకృతిని పవిత్రంగా భావించడం భారతీయ సంప్రదాయమని తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా సీఎం పోస్టు పెట్టారు.
అడవులు, వన్యప్రాణుల సంరక్షణ దైవసేవతో సమానమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. భవిష్యత్తు తరాలకు పచ్చని, ఆరోగ్యకరమైన తిరుమల అందించాలనే లక్ష్యంతో టీటీడీ చర్యలు చేపట్టిందని తెలిపారు. తిరుమల పర్యావరణ పరిరక్షణలో టీటీడీ చేస్తున్న కృషి అమోఘమని ప్రశంసించారు. శేషాచలం అటవీ సంపద కాపాడటంలో టీటీడీ నిరంతర చర్యలు కొనసాగాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
అమరావతిని క్వాంటం టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం: సీఎం చంద్రబాబు
పార్టీ పెట్టి ఉంటే కచ్చితంగా గెలిచేవాడిని: రజనీకాంత్
హైబ్రిడ్ మోడల్‌లో మహానాడు నిర్వహిస్తాం: పల్లా శ్రీనివాసరావు
Read Latest AP News And Telangana News And International News And Telugu News