Share News

జాలర్ల కుటుంబంతో ఆత్మీయంగా గడిపిన సీఎం చంద్రబాబు

ABN , Publish Date - May 19 , 2026 | 08:42 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా కావలి పర్యటనలో ఒక అరుదైన, ఆత్మీయ ఘట్టం చోటుచేసుకుంది. మంగళవారం కావలిలో సీఎం పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తన పర్యటనలో ప్రోటోకాల్ ఆడంబరాలకు దూరంగా ఒక సాధారణ జాలరి కుటుంబంతో కలిసి నేలపై కూర్చుని భోజనం చేశారు.

జాలర్ల కుటుంబంతో ఆత్మీయంగా గడిపిన సీఎం చంద్రబాబు
AP CM Nara Chandrababu Naidu

నెల్లూరు జిల్లా, మే 19 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu) నెల్లూరు జిల్లా కావలి పర్యటనలో ఒక అరుదైన, ఆత్మీయ ఘట్టం చోటుచేసుకుంది. ఈరోజు (మంగళవారం) కావలిలో సీఎం పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తన పర్యటనలో ప్రోటోకాల్ ఆడంబరాలకు దూరంగా ఒక సాధారణ జాలరి కుటుంబంతో కలిసి నేలపై కూర్చుని భోజనం చేశారు. ఈ అనుభవాన్ని సీఎం.. తన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పంచుకున్నారు. కావలి పర్యటనలో భాగంగా స్థానిక జాలరి కుటుంబానికి చెందిన తానంగారి గిరిబాబు ముఖ్యమంత్రి చంద్రబాబును తమ ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. సామాన్యులపై ఎప్పుడూ ప్రత్యేక గౌరవం చూపే చంద్రబాబు.. ఆ ఆహ్వానాన్ని ఎంతో సంతోషంగా స్వీకరించి వారి ఇంటికి వెళ్లారు.

CM-CHANDRA-6.jpg


ప్రేమతో వండిన వంటకాలు..

సంతలో తాజాగా పట్టిన చేపలను స్వయంగా సీఎం కొనుగోలు చేసి తీసుకువచ్చారు. ఆ చేపలతో కుటుంబ సభ్యురాలైన టి.వెంకమ్మ ఎంతో ప్రేమతో, సంప్రదాయ పద్ధతిలో రుచికరమైన వంటకాలను సిద్ధం చేశారు. ఆ కుటుంబ సభ్యుల మధ్య ఒకడిగా కూర్చుని చంద్రబాబు సాదాసీదాగా భోజనాన్ని ఆస్వాదించారు. కేవలం భోజనం చేయడమే కాకుండా, ఆ కుటుంబంతో కలిసి తీరప్రాంత ప్రజల జీవన విధానంపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు. ప్రజల మధ్యకు వెళ్లి వారి దైనందిన జీవన విధానాన్ని, కష్టాలను దగ్గరగా తెలుసుకోవడం పాలకుడిగా ఎంతో ముఖ్యమని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

CM-CHANDRA-1.jpg

CM-CHANDRA-5.jpg


జాలర్ల కష్టాలపై చర్చ..

ముఖ్యంగా జాలర్ల సమాజం ఎదుర్కొంటున్న ప్రస్తుత సమస్యలు, వేట నిషేధ కాలంలో వారు పడే ఇబ్బందులు, తీరప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం తరఫున ఎలాంటి చర్యలు తీసుకోవాలో స్థానికుల నుంచి సీఎం నేరుగా అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

CM-CHANDRA-2.jpg

CM-CHANDRA-9.jpg


సోషల్ మీడియాలో వైరల్.. ప్రశంసల జల్లు..

తమకు చూపిన అపారమైన ఆత్మీయతకు, అద్భుతమైన ఆతిథ్యానికి తానంగారి బాబు కుటుంబానికి సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా, ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా సామాన్యుడి ఇంట్లో భోజనం చేసిన ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సీఎం చంద్రబాబు అనురాగం, అప్యాయతలను అటు అభిమానులు, ఇటు కూటమి కార్యకర్తలతో పాటు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

CM-CHANDRA-4.jpg

CM-CHANDRA-8.jpg

CM-CHANDRA-7.jpg

CM-CHANDRA-2.jpg


ఈ వార్తలు కూడా చదవండి...

బుల్లెట్ వేగంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్లాంట్.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

భవిష్యత్తు న్యూక్లియర్ రంగంలో ఏపీ కీలక పాత్ర పోషిస్తుంది: నారా లోకేశ్

భార్యను అడ్డుపెట్టుకొని పేర్ని నాని బతికిపోయారు.. మంత్రి పార్థసారథి షాకింగ్ కామెంట్స్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 19 , 2026 | 09:15 PM