Share News

ఏపీలో విభిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు.. మరోవైపు భారీ వర్షాలు

ABN , Publish Date - Jun 07 , 2026 | 07:51 PM

ఏపీలో రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వ్యాఖ్యానించారు. ద్రోణి ప్రభావంతో కోస్తా, రాయలసీమలో వర్షం పడే సూచనలు ఉన్నాయని తెలిపారు.

ఏపీలో విభిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు.. మరోవైపు భారీ వర్షాలు
AP Weather

అమరావతి, జూన్7 (ఆంధ్రజ్యోతి): ఏపీలో రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వ్యాఖ్యానించారు. ద్రోణి ప్రభావంతో కోస్తా, రాయలసీమలో వర్షం పడే సూచనలు ఉన్నాయని తెలిపారు. అల్లూరి జిల్లా, పోలవరం, కర్నూలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చారు. పిడుగుల సమయంలో చెట్ల కింద నిలబడొద్దని అన్నారు. రైతులు, పశుకాపరులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఉరుములు, మెరుపులు వస్తే వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. తెగిపోయిన విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని ప్రఖర్ జైన్ తెలిపారు.


56 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు..

ఏపీలో 56 మండలాల్లో తీవ్ర వడగాడ్పుల హెచ్చరికలు ఉన్నాయని ప్రఖర్ జైన్ వివరించారు. మరో 67 మండలాల్లో వడగాడ్పుల ప్రభావం ఉండే అవకాశం ఉందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో 10 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు ఉంటాయని తెలిపారు. విజయనగరం జిల్లాలో 13 మండలాలకు హీట్ అలర్ట్ జారీ చేసినట్లు వెల్లడించారు. కాకినాడ జిల్లాలో 8 మండలాల్లో వడగాడ్పుల ప్రభావం ఉంటుందని తెలిపారు. కృష్ణా జిల్లాలో 3 మండలాల్లో తీవ్ర ఎండలు ఉండే అవకాశం ఉందని చెప్పారు. 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.


ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో తీవ్రంగా ఎండలు..

ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో తీవ్రంగా ఎండలు ఉంటాయని ప్రఖర్ జైన్ హెచ్చరించారు. రాయలసీమలో 40 డిగ్రీల నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని వివరించారు. ప్రకాశం జిల్లా కారేడులో 43.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని తెలిపారు. మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 43.4 డిగ్రీలు నమోదైందని చెప్పారు. పిట్టలవానిపాలెం, పెదపారుపూడిలో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత ఉందని వివరించారు. ఎండ తీవ్రతపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు తల, చెవులు కప్పుకోవాలని సూచించారు. గుండె, షుగర్, బీపీ బాధితులు ఎండలో తిరగొద్దని చెప్పారు. నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు ఎక్కువగా తీసుకోవాలని ప్రఖర్ జైన్ సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

గొడ్డలి పార్టీ ఆగడాలు శ్రుతిమించితే వదిలిపెట్టం.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

జగన్ హయాంలో ఎన్నో అరాచకాలు, అక్రమాలకు పాల్పడ్డారు: హోంమంత్రి అనిత

Read Latest Telangana News And AP News  And National News

And Telugu News

Updated Date - Jun 07 , 2026 | 08:18 PM