Share News

దేశంలో పెరుగుతున్న ఎండలు.. ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు

ABN , Publish Date - May 27 , 2026 | 11:33 AM

దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజలకు ఓ కీలక విజ్ఞప్తి చేశారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత పెరుగుతోందని పేర్కొన్నారు.

దేశంలో పెరుగుతున్న ఎండలు.. ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు
PM Narendra Modi

ఢిల్లీ, మే 27 (ఆంధ్రజ్యోతి): దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ప్రజలకు ఓ కీలక విజ్ఞప్తి చేశారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత పెరుగుతోందని పేర్కొన్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు రోజువారీ జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధాని పోస్టు పెట్టారు.


డీహైడ్రేట్‌కు గురికాకుండా చూసుకోవాలి..

ముఖ్యంగా శరీరం డీహైడ్రేట్‌కు గురికాకుండా చూసుకోవాలని, బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా తాగునీటిని వెంట తీసుకెళ్లాలని సూచించారు. ఎండ తీవ్రత ఉన్న సమయాల్లో అవసరం లేకుండా బయట తిరగకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దాహంతో ఉన్న వారికి ఒక గ్లాస్ నీరు అందించాలని, ఇళ్ల ముందు, దుకాణాల బయట మట్టికుండల్లో తాగునీరు ఏర్పాటు చేయాలని కోరారు. ఇతరులకు తాగునీరు అందించే వారిని అభినందిస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు. వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో చిన్నారులు, వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రధాని మోదీ సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మహానాడు-2026కు శ్రీకారం.. టీడీపీ జెండా ఆవిష్కరించిన చంద్రబాబు

స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలపై సీఎం చంద్రబాబు సమీక్ష.. వ్యవసాయ అనుబంధ రంగాలపై కీలక చర్చ

కరెంట్ సమస్యల పరిష్కారానికి 1912 టోల్ ఫ్రీ నెంబర్: మంత్రి గొట్టిపాటి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - May 27 , 2026 | 11:38 AM