వేసవిలో ఏసీ లేకుండా ఇంటిని చల్లగా ఎలా ఉంచుకోవచ్చంటే..
ABN , Publish Date - Apr 19 , 2026 | 10:11 AM
వేసవి అంటేనే ఎండ వేడి. తెల్లవారగానే ఆకాశంలో సూర్యుడు ప్రత్యక్షమవుతున్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సూర్యుడి భగభగలు కారణంగా బయటే కాదు ఇంట్లో కూడా ఉండ లేని పరిస్థితి ఏర్పడుతుంది.
వేసవి అంటేనే ఎండ వేడి. తెల్లవారగానే ఆకాశంలో సూర్యుడు ప్రత్యక్షమవుతున్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సూర్యుడి భగభగలు కారణంగా బయటే కాదు ఇంట్లో కూడా ఉండ లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఎండ వేడి మనపైనే కాకుండా.. ఇళ్లపైన కూడా ప్రభావం చూపుతుంది. ఇంటి పైకప్పు, గోడలపై అధికంగా పడే సూర్యరశ్మి వల్ల ఇంట్లో వేడి పెరుగుతుంది. దీనివల్ల ఇంట్లో ఉండటం కష్టమవుతుంది.
అందువల్ల చాలా మంది ఈ వేడి గాలి నుంచి తప్పించుకోవడానికి ఏసీలు, ఎయిర్ కూలర్లు ఆశ్రయిస్తారు. అయితే వాటిని ఆపేసిన వెంటనే వేడి మరింత పెరుగుతుంది. వేసవిలో ఏసీ లేకుండా.. మీ ఇంటిని చల్లగా ఉంచుకోవాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి. అది కూడా ఏసీలు, ఎయిర్ కూలర్లు ఉపయోగించకుండా.. అందుకు సింపుల్ చిట్కాలు.. అవి ఏమంటే..
ఇంటి పైకప్పుపై నీళ్లు..
వేసవిలో మీ ఇంటి పైకప్పు లేదా టెర్రస్‌పై నీళ్లు చల్లండి. రోజుకు రెండు లేదా మూడు సార్లు నీళ్లు చల్లడం వల్ల వేడి తగ్గుంది. ఇంట్లోని గదులు కూడా చల్లగా ఉంటాయి. సాయంత్రం వేళ నీళ్లు చల్లడం వల్ల రాత్రి వేళ చల్లగా ఉంటుంది. దీంతో మీ ఇంట్లో వేడి తగ్గుతుంది.
తెలుపు రంగు..
ఇంటి పైకప్పునకు తెలుపు రంగు వేయడం లేదా ప్లాస్టరింగ్ చేయడం వల్ల వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. తెలుపు రంగు సూర్యకిరణాలను పరావర్తనం చెందించడం ద్వారా వేడిని తగ్గిస్తుంది. చాలా మంది కూల్ రూఫ్ కోటింగ్స్‌ను ఉపయోగిస్తారు. ఇవి కూడాపై సూత్రం ఆధారంగానే పని చేసి.. ఇంటి ఉష్ణోగ్రతను 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గిస్తుంది. దీనివల్ల వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది.
కిటికీలు, తలుపులకు..
ఇల్లు వేడిగా ఉంటే.. దానిని సహజంగా చల్లగా ఉంచడం కోసం కిటికీలు, తలుపులకు తడి తెరలు వేలాడదీయవచ్చు. ఈ తడి తెరల ద్వారా గాలి వెళ్లినప్పుడు.. గది చల్లబడడంతో ఉష్ణోగ్రతలు తగ్గిస్తుంది. ఇది ఇంట్లో ఎయిర్ కూలర్‌లాగా పని చేస్తుంది. దీనికి విద్యుతు అవసరం లేదు. ఇంట్లో వేడిని తగ్గించడానికి ఇదో సులభమైన మార్గం.
మొక్కులు పెంచడం..
ఇంట్లో మొక్కలు పెంచడం ద్వారా వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇంట్టి మొక్కులు గాలిని శుద్ధి చేయడమే కాకుండా పరిసర ప్రాంతంలోని ఉష్ణోగ్రతలను తగ్గిస్తాయి. బాల్కనీలో లేదా కిటికీ వద్ద మొక్కలను ఉంచడం వల్ల ఇల్లు చల్లగా మారుతుంది. అందుకు ఎక్కువ డబ్బు కూడా ఖర్చు చేయకుండానే వేడి నుంచి ఉపశమనం పొందవచ్చు.
సాయంత్రం వేళ..
పగటిపూట కిటికీలు, తలుపులు మూసి.. సాయంత్రం వాటిని తెరవడం ద్వారా ఇంట్లో వేడిని తగ్గించడం ఒక మంచి మార్గం. మధ్యాహ్నం వేడి గాలి ఇంట్లోకి రాకుండా నిరోధించడం ముఖ్యం. సాయంత్రం చల్లని గాలి ఇంట్లోకి రావడం వల్ల వేడి తగ్గుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
బెంగళూరు-నరసాపురం రైలులో దొంగలు హల్‌చల్.. భారీ చోరీ
మండుతున్న ఎండలు.. శ్రీసత్యసాయి సేవా ట్రస్ట్ మజ్జిగ పంపిణీ
For More Telugu News