Share News

ఏపీలో రికార్డు స్థాయికి ఎండలు.. హీట్‌వేవ్ అలర్ట్..

ABN , Publish Date - May 18 , 2026 | 08:51 PM

రాబోయే మూడు రోజుల పాటు కోస్తాంధ్ర జిల్లాల్లో ఎండ తీవ్రత మరింత పెరిగి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. పలు జిల్లాల్లో 45°C నుంచి 47°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హెచ్చరించారు.

 ఏపీలో రికార్డు స్థాయికి ఎండలు.. హీట్‌వేవ్  అలర్ట్..
AP Weather

అమరావతి, మే 18 (ఆంధ్రజ్యోతి): రాబోయే మూడు రోజుల పాటు కోస్తాంధ్ర జిల్లాల్లో ఎండ తీవ్రత మరింత పెరిగి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. పలు జిల్లాల్లో 45°C నుంచి 47°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హెచ్చరించారు. ఈరోజు(సోమవారం) నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో అత్యధికంగా 44.3°C ఉష్ణోగ్రత నమోదు కాగా, కడపలో 42.9°C నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా ఎండలు తీవ్రరూపం దాల్చడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


మే 19న తీవ్ర ఉష్ణోగ్రతలు..

  • విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, ఏలూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44°C - 46°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం.

  • శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C - 44°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం.

  • విశాఖపట్నం, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40°C - 42°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం.


మే 20 బుధవారం..

  • శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C - 47°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం.

  • నెల్లూరు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44°C - 45°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం.

  • కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41°C - 43°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం.


మే 21 గురువారం

  • విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C - 47°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం.

  • శ్రీకాకుళం, విశాఖపట్నం, కర్నూలు, అనంతపురం శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C - 44°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం.

  • అలాగే రేపు 47 మండలాల్లో తీవ్రవడగాడ్పులు, 88 మండలాల్లో వడగాడ్పులు, ఎల్లుండి 177 మండలాల్లో తీవ్రవడగాడ్పులు, 255 మండలాల్లో వడగాడ్పులు ప్రభావం చూపే అవకాశంఉందని తెలిపారు.


వడగాల్పుల హెచ్చరిక..

రేపు రాష్ట్రంలోని 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 88 మండలాల్లో వడగాడ్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించారు. ఎల్లుండి పరిస్థితి మరింత తీవ్రంగా ఉండొచ్చని, 177 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 255 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు.

ప్రజలకు సూచనలు..

అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం సమయంలో బయటకు రావద్దని సూచించారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఎక్కువగా నీరు, మజ్జిగ, పండ్లరసాలు తీసుకోవాలని సూచించారు. ఎండలో పని చేసే వారు తలకు రక్షణగా టోపీ ఉపయోగించాలని వైద్య నిపుణులు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

అమరావతిని క్వాంటం టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం: సీఎం చంద్రబాబు

పార్టీ పెట్టి ఉంటే కచ్చితంగా గెలిచేవాడిని: రజనీకాంత్

హైబ్రిడ్ మోడల్‌లో మహానాడు నిర్వహిస్తాం: పల్లా శ్రీనివాసరావు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 18 , 2026 | 09:00 PM