తెలంగాణ వ్యాప్తంగా హీట్ వేవ్‌పై హై అలర్ట్.. మంత్రి పొంగులేటి కీలక సూచనలు
ABN , Publish Date - May 23 , 2026 | 02:20 PM
రాష్ట్రవ్యాప్తంగా హీట్ వేవ్‌పై హై అలర్ట్ ప్రకటించినట్లు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తీవ్ర ఉష్ణోగ్రతలపై మంత్రి పొంగులేటి సచివాలయంలో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్, మే 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా హీట్ వేవ్‌పై హై అలర్ట్ ప్రకటించినట్లు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) స్పష్టం చేశారు. తీవ్ర ఉష్ణోగ్రతలపై మంత్రి పొంగులేటి సచివాలయంలో ఈరోజు (శనివారం) అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై మంత్రి దిశానిర్దేశం చేశారు. వడగాల్పులతో 7 జిల్లాల్లో 16 మంది మృతిచెందారని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు ప్రకటించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో నష్టపరిహారం ఇస్తున్నామని స్పష్టం చేశారు. వచ్చే మూడు రోజులు మరింత తీవ్రంగా హీట్ వేవ్ ఉండనుందని తెలిపారు. జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని మార్గనిర్దేశం చేశారు. ప్రజల ప్రాణ రక్షణే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని తెలిపారు. వడగాల్పులతో ఒక్క ప్రాణం కూడా కోల్పోకూడదని చెప్పుకొచ్చారు.
గంట గంటకు హెచ్చరికలు జారీ..
ఎండ తీవ్రతపై ప్రజలకు గంట గంటకు హెచ్చరికలు జారీ చేశామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ప్రజలు బయటకు రావొద్దని సూచించారు. వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. వ్యవసాయ, భవన నిర్మాణ కార్మికులు ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. హీట్‌వేవ్‌పై గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఎండదెబ్బకు గురైన వ్యక్తులకు ఆయా ఆస్పత్రులు అత్యవసర చికిత్స అందించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ చరిత్రాత్మక రికార్డ్: మంత్రి ఉత్తమ్
కేజీ బేసిన్ గ్యాస్ వివాదం.. రిలయన్స్‌కు సుప్రీంకోర్టులో షాక్
Read Latest Telangana News And AP News And International News And Telugu News