ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ చరిత్రాత్మక రికార్డ్: మంత్రి ఉత్తమ్
ABN , Publish Date - May 21 , 2026 | 08:57 PM
ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ చరిత్రాత్మక రికార్డ్ సాధించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. 8,575 కొనుగోలు కేంద్రాల నుంచి 46.21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు.
హైదరాబాద్, మే 21 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ చరిత్రాత్మక రికార్డ్ సాధించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) వ్యాఖ్యానించారు. 8,575 కొనుగోలు కేంద్రాల నుంచి 46.21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. 6.3 లక్షల మంది రైతులకు రూ.7,841 కోట్ల చెల్లింపులు చేశామని ప్రస్తావించారు. ధాన్యం రవాణా కోసం 13,000 వాహనాలు వినియోగించామని అన్నారు. ఈరోజు (గురువారం) హైదరాబాద్ వేదికగా మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు.
అందుబాటులో18.3 కోట్ల గన్నీ బ్యాగులు ఉన్నాయని వివరించారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు చేస్తోందని స్పష్టం చేశారు. ఇది రైతు పక్షపాత ప్రభుత్వమని పేర్కొన్నారు. అబద్దాల రాజకీయాలకు బీఆర్ఎస్ పెట్టింది పేరని విమర్శించారు. రైతు సంక్షేమంపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రైతాంగాన్ని తప్పుదోవ పట్టించేందుకేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
సరస్వతీ అంత్య పుష్కరాలకు ఘనంగా ఏర్పాట్లు.. భక్తులకు సీఎం శుభాకాంక్షలు
కేసీఆర్ కుటుంబ పాలనను అంతం చేశాం: బండి సంజయ్
ఆ ఆస్పత్రులు ఉచిత సేవలు ఇవ్వాల్సిందే: సుప్రీంకోర్టు
Read Latest Telangana News And AP News And International News And Telugu News