కేజీ బేసిన్ గ్యాస్ వివాదం.. రిలయన్స్‌కు సుప్రీంకోర్టులో షాక్
ABN , Publish Date - May 21 , 2026 | 02:23 PM
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన కేజీ బేసిన్ గ్యాస్ తరలింపు వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రూ.12,800 కోట్ల విలువైన ఈ భారీ సహజ వాయువు వివాదంపై విచారణను నిలిపివేయాలన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.
ఢిల్లీ, మే 21 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన కేజీ బేసిన్ గ్యాస్ తరలింపు వివాదంలో సుప్రీంకోర్టు (Supreme Court) కీలక నిర్ణయం తీసుకుంది. రూ.12,800 కోట్ల విలువైన ఈ భారీ సహజ వాయువు వివాదంపై విచారణను నిలిపివేయాలన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతుందని స్పష్టమైంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశంపై స్పష్టమైన వ్యాఖ్యలు చేయడం దేశ కార్పొరేట్, ఆయిల్, గ్యాస్ రంగాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
కేంద్రప్రభుత్వంతో మధ్యవర్తిత్వానికి సిద్ధమని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. ఈ చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటామని కోర్టుకు రిలయన్స్ లాయర్లు తెలిపారు. సామరస్యపూర్వక పరిష్కారానికి వస్తేనే ఈ కేసు మూసివేస్తామని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈ కేసు విచారణ నిలిపివేతపై కేంద్రప్రభుత్వం, ONGC అభ్యంతరం వ్యక్తం చేశాయి. భూగర్భం నుంచి రిలయన్స్ బ్లాక్‌లోకి సహజ వాయువు తరలింపుపై సుదీర్ఘ వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ONGC గ్యాస్‌ను రిలయన్స్ అక్రమంగా వెలికితీసిందంటూ గతంలో కేంద్రం నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. కేంద్రం రికవరీ నోటీసులను సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు గతంలో తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ముకేశ్ అంబానీ సంస్థ ఆశ్రయించింది. ఈ కేసు ఫలితంపై ఆయిల్, గ్యాస్ కార్పొరేట్ రంగంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి...
సరస్వతీ అంత్య పుష్కరాలకు ఘనంగా ఏర్పాట్లు.. భక్తులకు సీఎం శుభాకాంక్షలు
కేసీఆర్ కుటుంబ పాలనను అంతం చేశాం: బండి సంజయ్
ఆ ఆస్పత్రులు ఉచిత సేవలు ఇవ్వాల్సిందే: సుప్రీంకోర్టు
Read Latest Telangana News And AP News And International News And Telugu News