మహానాడు నిర్వహణపై లోకేశ్ కీలక చర్చలు.. స్థలాల పరిశీలనకు ఆదేశాలు
ABN , Publish Date - Apr 14 , 2026 | 06:35 PM
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉన్న నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.
అమరావతి, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈరోజు(మంగళవారం) మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉన్న నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. లోకేశ్‌తో భేటీకి ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మరికొందరు కీలక నేతలు హాజరయ్యారు. మేలో జరిగే మహానాడు నిర్వహణపై ప్రధానంగా చర్చించారు.
17న మహానాడు స్థల ఎంపికపై తుది నిర్ణయం
ఈసారి మహానాడును నిర్వహించడానికి శ్రీకాకుళం జిల్లా రణస్థలం, విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఈ ప్రాంతాలను టీడీపీ హైకమాండ్ పరిశీలిస్తోంది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు ఈ రెండు ప్రాంతాల్లో స్థలాలు పరిశీలించాలని నారా లోకేశ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల17వ తేదీన మహానాడు స్థల ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంటామని లోకేశ్ స్పష్టం చేశారు. మహానాడులోపు పార్టీకి సంబంధించి అన్ని కమిటీల ఎంపికపైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
పొలిట్ బ్యూరోలో కీలక మార్పులు..
పార్టీ జాతీయ కమిటీ, రాష్ట్ర కమిటీ, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులను కూడా ఖరారు చేస్తామని లోకేశ్ తెలిపారు. పొలిట్ బ్యూరోలో కీలక మార్పులు చేయనున్నట్లు వెల్లడించారు. మండల స్థాయి నాయకులను పొలిట్ బ్యూరోలోకి తీసుకోడానికి హై కమాండ్ ఆలోచిస్తోందని అన్నారు. అలాగే, తాజా రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇకపై పొలిటికల్ స్ట్రాటజీపై మరింత దృష్టి పెట్టాలని ఈ సమావేశంలో లోకేశ్ నిర్ణయం తీసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
డీ-రెగ్యులేషన్ ఫేజ్-3పై ముందస్తు చర్చలు.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు
జగన్‌వి.. శవ రాజకీయాలు.. మంత్రి అచ్చెన్నాయుడు సెటైర్లు
వివేకా కేసులో కొత్త మలుపు.. తదుపరి దర్యాప్తు కోరుతూ హైకోర్టులో సునీతారెడ్డి పిటిషన్
Read Latest AP News And Telangana News And International News And Telugu News