Share News

మద్యం స్కాం కేసులో వాసుదేవ రెడ్డికి బెయిల్ మంజూరు

ABN , Publish Date - Apr 17 , 2026 | 06:48 PM

ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఏ2 నిందితుడు వాసుదేవ రెడ్డికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.

మద్యం స్కాం కేసులో వాసుదేవ రెడ్డికి బెయిల్ మంజూరు
AP Liquor Scam Case

విజయవాడ, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): ఏపీ మద్యం కుంభకోణం కేసులో (AP Liquor Scam Case) ఏ2 నిందితుడు వాసుదేవ రెడ్డికి (Vasudeva Reddy) ఏసీబీ కోర్టు ఈరోజు (శుక్రవారం) బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. 2, 4 సోమవారాల్లో విచారణ అధికారుల ఎదుట హాజరవ్వాలని, పాస్‌పోర్ట్ సరెండర్ చేయాలని, లక్ష చొప్పున ఇద్దరు పూచీకత్తులు ఇవ్వాలని ఆదేశించింది. ఇదే కేసులో మరో నిందితుడు ప్రణయ్ ప్రకాశ్ బెయిల్‌ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. ఇదే కేసులో మరో ముగ్గురు నిందితులు ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డిల రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ పూర్తి చేసింది. ఈ తీర్పును ఏప్రిల్ 24వ తేదీకి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.


ఈ వార్తలు కూడా చదవండి...

మహానాడు నిర్వహణపై లోకేశ్ కీలక చర్చలు.. స్థలాల పరిశీలనకు ఆదేశాలు

మావిగన్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.. జగన్ అండ్ కోపై ఆనం ధ్వజం

ఏపీలో మోత మోగిస్తున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Apr 17 , 2026 | 06:51 PM