Share News

నారీ శక్తి వందన్ బిల్లుపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి.. మంత్రి సత్యకుమార్ ధ్వజం

ABN , Publish Date - Apr 17 , 2026 | 05:55 PM

నారీ శక్తీ వందనం బిల్లుపై పార్లమెంట్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అత్యంత బాధ్యత రహితంగా మాట్లాడారని ఏపీ మంత్రి సత్య కుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా సాధికారిత బిల్లుపై, మహిళల అభివృద్ధి గురించి మాట్లాడమంటే ప్రధానమంత్రి నరేంద్రమోదీపై అవహేళనగా మాట్లాడారని ధ్వజమెత్తారు.

నారీ శక్తి వందన్ బిల్లుపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి.. మంత్రి సత్యకుమార్ ధ్వజం
Minister Satya Kumar Yadav

విజయవాడ, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): నారీ శక్తీ వందనం బిల్లుపై పార్లమెంట్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అత్యంత బాధ్యతారహితంగా మాట్లాడారని ఏపీ మంత్రి సత్య కుమార్ యాదవ్ (Minister Satya Kumar Yadav) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా సాధికారిత బిల్లుపై, మహిళల అభివృద్ధి గురించి మాట్లాడమంటే ప్రధానమంత్రి నరేంద్రమోదీపై అవహేళనగా మాట్లాడారని ధ్వజమెత్తారు. ఒక దేశ ప్రధానిని పట్టుకుని జాదూఘర్, ఓ మ్యాజిషన్ అని, ఓ సైనిక శక్తిని అవహేళన చేసేలా రాహుల్ గాంధీ మాట్లాడారని.. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ.. మోదీపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.


ఆ అర్హతలు రాహుల్ గాంధీకి ఏమాత్రం లేవు..

దేశ ప్రజలందరికీ రాహుల్ ఫ్రస్ట్రేషన్ అనేది తేటతెల్లమవుతుందని మంత్రి సత్య కుమార్ యాదవ్ విమర్శించారు. ఓ ప్రతిపక్ష నేతగా ఉండాల్సిన అర్హతలు రాహుల్ గాంధీకి ఏమాత్రం లేవని ఎద్దేవా చేశారు. దేశ ప్రధాని మోదీ డెసిషన్, లీడర్ షిప్‌ని ప్రజలందరూ చూశారని వ్యాఖ్యానించారు. దేశ అభివృద్ధి కళ్లముందు కనిపిస్తోందని చెప్పుకొచ్చారు. అంతర్జాతీయంగా భారతదేశానికి ఖ్యాతి తీసుకొచ్చేలా ప్రధాని మోదీ చర్యలు చేపట్టారని ఉద్ఘాటించారు. మన సైనిక శక్తిని, దేశ భద్రతను అవమానించే విధంగా రాహుల్ గాంధీ మాట్లాడటం అత్యంత హేయమని ఆగ్రహించారు. పాకిస్థాన్‌కు గుణపాఠం చెప్పేలా ప్రధాని మోదీ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారని ప్రస్తావించారు.


ప్రజల విజ్ఞతను రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారా..?

సైనికుల బలం మన దేశ భద్రత సత్తా ఏంటో తెలిసి పాకిస్థాన్ కూడా తమపై దాడులు జరిగాయని ఒప్పుకుందని మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. అలాంటి దేశ భద్రతపై, సైనికులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఏ శక్తివంతమైన దేశానికి మన దేశం తీసిపోకుండా చేశారని చెప్పారు. నల్లదనాన్ని కట్టడి చేసినందుకు దేశ ప్రజలందరూ స్వాగతించారని అన్నారు. ప్రజల విజ్ఞతను రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారా..? అని దుయ్యట్టారు. ఎవరి హయాంలో ఎలా పాలనా సాగిందో ప్రజలందరూ మర్చిపోలేదని చెప్పారు. 2జీ స్కాం దగ్గర నుంచి కోల్ స్కాం వరకు లక్షల కోట్లు ఏవిధంగా దోచుకున్నారో అందరికీ తెలుసునని అన్నారు. మహిళల సాధికారత కోసం తీసుకొస్తున్న బిల్లును వ్యతిరేకించటం రాహుల్ గాంధీ మనస్తత్వం ఏంటో అర్ధమవుతుందని విమర్శించారు. అవినీతి, ఆరోపణ లేకుండా అత్యంత పారదర్శకంగా మోదీ పాలన అందిస్తున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మహానాడు నిర్వహణపై లోకేశ్ కీలక చర్చలు.. స్థలాల పరిశీలనకు ఆదేశాలు

మావిగన్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.. జగన్ అండ్ కోపై ఆనం ధ్వజం

ఏపీలో మోత మోగిస్తున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Apr 17 , 2026 | 06:02 PM