Home » Womens Reservation Bill
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్ అగ్రస్థాయి దేశంగా మారుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ రిఫార్మర్, పెర్ఫార్మర్, విన్నర్ అని ప్రశంసించారు.
మహిళలకు హక్కులు దక్కకుండా కాంగ్రెస్‌తో టీఎంసీ కుమ్మక్కై బిల్లును అడ్డుకుందంటూ ప్రధాని బెంగాల్ ఎన్నికల ప్రచారంలో తాజాగా విమర్శించగా, మహిళలకు ప్రాతనిధ్యం కల్పించడంలో టీఎంసీ ఛాంపియన్ అని మమతా బెనర్జీ తిప్పికొట్టారు.
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు వీగిపోవడంతో విపక్షాలపై మోదీ విమర్శల దాడిని కొనసాగించారు. కాంగ్రెస్ పార్టీతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ కుమ్మక్కై దిగువసభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ఓడించారని, ఇందువల్ల మహిళలకు జరగాల్సిన న్యాయం జరగలేదని విమర్శించారు.
మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోవడంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) విపక్షాలపై నిప్పులు చెరిగారు. విపక్షాలు మహిళా వ్యతిరేకులని, మహిళలకు రాజకీయ సాధికారత కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును అడ్డుకునేందుకు ఉద్దేశపూర్వకంగా కుట్ర చేశారని ఆరోపించారు.
మహిళా రిజర్వేషన్ల అమలుకు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్, ఇండియా కూటమి వ్యతిరేకం కాదని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిన్న(శనివారం) సాయంత్రం మహిళల గురించి మాట్లాడారని తెలిపారు.
పార్లమెంట్‌లో మహిళా బిల్లు వీగిపోవడం చీకటి రోజని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. మహిళా బిల్లు వీగిపోయిందని కాంగ్రెస్ వీర్రవీగుతోందని ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జగిత్యాలలో పాల్గొననున్న మీటింగ్‌పై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శలు చేశారు. బయటకు వస్తే పులి సంగతి చెబుతామని హెచ్చరించారు.
నియోజకవర్గాల పునర్విభన బిల్లు, మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు పార్లమెంట్‌లో వీగిపోవడం దురదృష్టకరమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ బిల్లులను అడ్డుకోవడం చారిత్రాత్మక తప్పిదమని పేర్కొన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో అన్న క్యాంటీన్లు మూసేసి, పేదలకు అన్నం లేకుండా చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో గొడ్డలి పార్టీ ఉందని.. పేదల సమస్యలు పట్టవని ధ్వజమెత్తారు.
బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీల మనుగడ భవిష్యత్తులో కష్టంగా ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అలాగే అవుతుందని పేర్కొన్నారు.