మహానాడులో లోకేశ్ సంచలన నిర్ణయం... మహిళలకు 33శాతం మహిళా రిజర్వేషన్ల ప్రతిపాదన
ABN , Publish Date - May 27 , 2026 | 01:24 PM
మహానాడు వేదికగా టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ మంత్రి నారా లోకేశ్ సంచలన ప్రతిపాదన చేశారు. పార్టీ పరంగా 33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన ప్రతిపాదిస్తూ కీలక చర్చకు శ్రీకారం చుట్టారు.
అమరావతి, మే 27 (ఆంధ్రజ్యోతి): మహానాడు వేదికగా టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) సంచలన ప్రతిపాదన చేశారు. పార్టీ పరంగా 33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రతిపాదిస్తూ కీలక చర్చకు శ్రీకారం చుట్టారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత లోకేశ్ చేసిన ఈ ప్రతిపాదన రాష్ట్ర రాజకీయాల్లోనే కాక జాతీయస్థాయిలో కూడా ఆసక్తికర చర్చకు దారితీసింది. 2026 మహానాడును ‘స్త్రీ శక్తి’ థీమ్‌తో నిర్వహించాలని టీడీపీ తీసుకున్న నిర్ణయానికి ఈ ప్రతిపాదన మరింత ప్రాధాన్యాన్ని తీసుకువచ్చిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని పెంచే దిశగా అడుగులు..
మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని పెంచడం, నిర్ణయాత్మక స్థానాల్లో వారికి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా ఈ నిర్ణయం ఉందని నాయకులు చెబుతున్నారు. మహిళా రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించే అంశంతో సంబంధం లేకుండా పార్టీ అంతర్గత వ్యవస్థలోనే 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని లోకేశ్ ప్రతిపాదించడం విశేషంగా మారింది. రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా లోకేశ్ ప్రస్తావించారు. టీడీపీ భవిష్యత్తు కార్యాచరణలో మహిళలకు మరింత ప్రాధాన్యం కల్పించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. మహానాడు వేదికగా వచ్చిన ఈ ప్రతిపాదనపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ కొనసాగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి...
మహానాడు-2026కు శ్రీకారం.. టీడీపీ జెండా ఆవిష్కరించిన చంద్రబాబు
విజన్ పాలిటిక్స్‌కు టీడీపీ నాంది.. మహానాడులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News