Home » Mangalagiri
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సేప్టీ టూరిజం పాలసీ రావాలని తాను స్పష్టంగా చెప్పానని ప్రస్తావించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జనసేన నేతలతో మంగళగిరిలోని ఆ పార్టీ క్యాంపు కార్యాలయంలో సోమవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను యువ ట్రావెల్ వ్లాగర్ స్వాతి రోజా మర్యాదపూర్వకంగా కలిశారు. డిప్యూటీ సీఎంతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు.
మహిళా అంధ క్రికెటర్లు సాధించిన విజయం దేశానికే గర్వకారణమని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుతో పవన్ సమావేశమై.. వారిని సత్కరించారు.
క్రిమినల్స్ అప్డేట్ అవుతున్నారని.. వారి కంటే ముందుండకపోతే కట్టడి చేయలేమని సీఎం అన్నారు. అన్ని ఇజంలను అరికట్టాలంటే సమర్థంగా ఉండాలని చెప్పారు. గూగుల్ సంస్థ పెట్టుబడులు వైజాగ్ వచ్చాయంటే దానికి కారణం నమ్మకం.. శాంతి భద్రతలపై నమ్మకంతో పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు.
పంచాయతీ పరిపాలన వ్యవస్థలో వినూత్న సంస్కరణలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. పునర్వ్యవస్థీకరణతో మెరుగైన సేవలు అందించగలమని పేర్కొన్నారు.
ప్రజలు తనకిచ్చిన మెజారిటీతోనే ఎక్కడా లేని అభివృద్ధి పనులు మంగళగిరిలో జరుగుతున్నాయని మంత్రి లోకేష్ తెలిపారు. మంగళగిరిలో జెమ్స్ అండ్ జ్యూవలరీ పార్క్ అభివృద్ధిపై దృష్టి సారించామని చెప్పారు.
మాస్టర్ ప్లాన్ ప్రకారం మంగళగిరి కొండ చుట్టూ ¾ వంతు భాగంలో పాత, కొత్త హైవేలను కలిపే విధంగా వంద అడుగుల రోడ్డును 3.47 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తారు. ఇది పానకాలస్వామి ఘాట్ రోడ్డుతో అనుసంధానమయ్యే విధంగా ఉంటుంది.
ఎన్ని ఆర్థిక కష్టాలు ఉన్నా.. తనకు మొట్టమొదటగా గుర్తొచ్చేది చేనేత కార్మికులేనని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ నెల నుంచే చేనేత కుటుంబాలకు 200 యూనిట్లు, మగ్గాలకు 500 యూనిట్లు ఉచితంగా ఇస్తామని భరోసా కల్పించారు. చేనేత కార్మికులు నేచే బట్టలపై జీఎస్టీ ఐదుశాతం ప్రభుత్వమే భరిస్తుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
చేనేతల ఆదాయం 30శాతం పెరిగేలా అన్ని విధాలా చర్యలు తీసుకున్నామని మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. చేనేతలను ఆదుకుంటూనే స్వర్ణకారులకు ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. అతిథులు ఎవరిని కలిసినా మంగళగిరి వస్త్రాన్ని బహుమతిగా ఇచ్చే ఆనవాయితీ పెట్టుకున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.