Share News

Swathi Roja Meet Pawan: పవన్ కల్యాణ్‌‌ను కలిసిన యువ ట్రావెల్ వ్లాగర్ స్వాతి రోజా.. ఎందుకంటే..

ABN , Publish Date - Dec 22 , 2025 | 05:18 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను యువ ట్రావెల్ వ్లాగర్ స్వాతి రోజా మర్యాదపూర్వకంగా కలిశారు. డిప్యూటీ సీఎంతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు.

Swathi Roja Meet Pawan: పవన్ కల్యాణ్‌‌ను కలిసిన యువ ట్రావెల్ వ్లాగర్ స్వాతి రోజా.. ఎందుకంటే..
Swathi Roja Meet Pawan

అమరావతి, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా బైక్‌పై ఒంటరిగా ప్రయాణిస్తూ ఆధ్యాత్మిక అంశాలను అందరికీ పంచుకుంటున్న జెన్ Z వ్లాగర్ స్వాతి రోజా(Young Travel Vlogger Swathi Roja)కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభినందనలు తెలిపారు. ఆమె చేస్తున్న సాహన యాత్ర గురించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

PAWAN-2.jpg


భవిష్యత్ యాత్రలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పవన్ కల్యాణ్‌ని స్వాతి రోజా ఈరోజు(సోమవారం) మర్యాదపూర్వకంగా కలిశారు. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా కొద్ది వారాల క్రితం ఆమె శ్రీశైలంలో పర్యటించినప్పుడు వసతి, భద్రతకు సంబంధించిన సమస్యలు తలెత్తాయి.

PAWAN-4.jpg


ఈ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ ఆమెకు శ్రీశైలంతోపాటు, తిరుమల, శ్రీకాళహస్తి, విజయవాడ కనకదుర్గ ఆలయాల్లో ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. దుర్గమ్మ దర్శనం అనంతరం పవన్ కల్యాణ్‌ని కలిసి.. ఆయన చూపిన శ్రద్ధకు ధన్యవాదాలు తెలిపారు. శ్రీశైలంలో గతంలో ఎదురైన అనుభవాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా బైక్ రైడింగ్, బైకులపై తనకున్న ఆసక్తిని పవన్ కల్యాణ్ పంచుకున్నారు.

PAWAN-3.jpg


ఈ వార్తలు కూడా చదవండి...

ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ వ్యక్తిత్వ హక్కుల పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

ఇస్రో నుంచి మరో రాకెట్ ప్రయోగం.. ముహూర్తం ఫిక్స్

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 22 , 2025 | 05:28 PM