Share News

Pawan Kalyan: అరాచకాలు చేస్తామంటే చూస్తూ ఊరుకోం.. జగన్ అండ్ కోకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్

ABN , Publish Date - Dec 22 , 2025 | 06:15 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సేప్టీ టూరిజం పాలసీ రావాలని తాను స్పష్టంగా చెప్పానని ప్రస్తావించారు.

Pawan Kalyan: అరాచకాలు చేస్తామంటే చూస్తూ ఊరుకోం.. జగన్ అండ్ కోకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
Pawan Kalyan

అమరావతి, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి (YS Jagan Mohan Reddy) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సేఫ్టీ టూరిజం పాలసీ రావాలని తాను స్పష్టంగా చెప్పానని ప్రస్తావించారు. తాము అధికారంలోకి వస్తే పోలీసులను అరెస్టు చేస్తాం.. చంపేస్తాం అని జగన్ అండ్ కో చెబుతుంటే.. ఎలా అని ప్రశ్నల వర్షం కురిపించారు. వైసీపీ నాయకులు బెదిరించడాలు మానేయాలి.. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు పవన్ కల్యాణ్.


వైసీపీ నేతలు ఇలా మాట్లాడుతుంటే తాము చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. జనసేన నేతలతో మంగళగిరిలోని ఆ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఇవాళ(సోమవారం) సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి జనసేన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, పలు కార్పొరేషన్‌ల చైర్మన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలను ఉద్దేశించి మాట్లాడారు పవన్ కల్యాణ్.


జగన్ అండ్ కో మళ్లీ అధికారంలోకి వస్తామనే ప్రకటనలను పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు నమ్మవద్దని సూచించారు. అధికారులు, ప్రజలు ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. జగన్ అండ్ కో మళ్లీ అధికారంలోకి రారని.. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఏపీకి, భారతదేశ సమగ్రతకు భంగం వాటిళ్లకుండా చూస్తానని స్పష్టం చేశారు. దానికోసం ఎన్ని ఎత్తులు అయినా వేసేందుకు తాను సిద్ధమని చెప్పుకొచ్చారు. జగన్ అండ్ కో రౌడీలను వెనుకేసుకువస్తాం.. గంజాయి రౌడీలను తీసుకువస్తాం అంటే.. తాము చూస్తూ ఊరుకుంటామా అని మందలించారు పవన్ కల్యాణ్.


జ్యూడీషియరీ పరంగా ఇబ్బందులు ఉంటాయని పోలీసులు కూడా భయపడే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ చాలా కీలకమని.. వాటిని కంట్రోల్ చేస్తేనే రాష్ట్రంపై నమ్మకం ఉంటుందని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం చేసే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలు, ఇతర పార్టీల్లోని నాయకులు తమకు మద్దతుగా నిలవాలని సూచించారు. క్రిమినాలిటీ పెరిగితే ఈ రాష్ట్రాన్ని ఎవరూ బాగు చేయలేరని అన్నారు. పొలిటికల్ లీడర్ షిప్ రాష్ట్రంలో వ్యవస్థలను చంపేసిందని విమర్శించారు. వారిప్రమేయం లేకుండా అధికారులు ఏమీ చేయలేని పరిస్థితికి ఏపీని తీసుకుచ్చారని పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

పవన్ కల్యాణ్‌‌ను కలిసిన యువ ట్రావెల్ వ్లాగర్ స్వాతి రోజా.. ఎందుకంటే..

ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ వ్యక్తిత్వ హక్కుల పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 22 , 2025 | 06:38 PM