Pawan Kalyan: పంచాయతీ పరిపాలన వ్యవస్థలో వినూత్న సంస్కరణలు చేపట్టాం: పవన్ కల్యాణ్
ABN , Publish Date - Oct 15 , 2025 | 09:54 PM
పంచాయతీ పరిపాలన వ్యవస్థలో వినూత్న సంస్కరణలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. పునర్వ్యవస్థీకరణతో మెరుగైన సేవలు అందించగలమని పేర్కొన్నారు.
అమరావతి, అక్టోబరు15 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ పరిపాలన వ్యవస్థలో వినూత్న సంస్కరణలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ శాఖ పునర్వ్యవస్థీకరణతో మెరుగైన సేవలు అందించగలమని పేర్కొన్నారు. ఈ రోజు(బుధవారం) మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఏపీ పంచాయతీ సెక్రెటరీస్ అసోసియేషన్ ప్రతినిధులు పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌తో వారు పలు కీలక అంశాలపై చర్చించారు. పంచాయతీ పరిపాలన వ్యవస్థలో వినూత్న సంస్కరణలు చేపట్టినందుకు పవన్ కల్యాణ్‌కి ఏపీ పంచాయతీ సెక్రెటరీస్ అసోసియేషన్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. 10వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ పవన్ కల్యాణ్ నూతన ఉత్తేజాన్నిఇచ్చారని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ వ్యవస్థలో సంస్కరణలు చేపట్టి నాలుగు గ్రేడులుగా పంచాయతీలను వర్గీకరించడం శుభ పరిణామమని కొనియాడారు. పంచాయతీ పరిపాలన వ్యవస్థలో పవన్ కల్యాణ్ పునర్వ్యవస్థీకరణ చేపట్టారని ఏపీ పంచాయతీ సెక్రెటరీస్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జర్నలిజం విలువల పరిరక్షణలో ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ముందుంది: సీఎం చంద్రబాబు
ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
Read Latest AP News And Telugu News