Share News

Chandrababu Wishes to Andhrajyothy: జర్నలిజం విలువల పరిరక్షణలో ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ముందుంది: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Oct 15 , 2025 | 04:08 PM

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల వార్షికోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. నిష్పక్షపాతంగా వార్తలను అందించడంలో ముందుండే ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఛానళ్ల ప్రస్థానం మరింత ద్విగుణీకృతం కావాలని కోరుకుంటున్నానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Chandrababu Wishes to Andhrajyothy: జర్నలిజం విలువల పరిరక్షణలో ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ముందుంది: సీఎం చంద్రబాబు
CM Chandrababu Wishes to ABN - Andhrajyothy

అమరావతి, అక్టోబరు15 (ఆంధ్రజ్యోతి): ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి (ABN - Andhrajyothy) సంస్థల వార్షికోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం వేదికగా సీఎం చంద్రబాబు ట్వీట్ పెట్టారు.


పాఠకులపై చెరగని ముద్ర..

‘23 సంవత్సరాలుగా తెలుగు పాఠకులపై చెరగని ముద్ర వేస్తున్న ఆంధ్రజ్యోతి దినపత్రికకు, 16 సంవత్సరాలుగా విశిష్ట న్యూస్ ఛానల్‌గా వెలుగొందుతున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్‌కు వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ మీడియా సంస్థల నిర్వాహకులు, ప్రముఖ జర్నలిస్టు వేమూరి రాధాకృష్ణ గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు. నిష్పక్షపాతంగా వార్తలను అందించడంలో ముందుండే ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఛానళ్ల ప్రస్థానం మరింత ద్విగుణీకృతం కావాలని కోరుకుంటున్నాను. పాత్రికేయ విలువలను పరిరక్షిస్తూ నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ సంస్థల సిబ్బందికి, ఉద్యోగులకు, జర్నలిస్టులకు వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

డబుల్ ఇంజిన్ కాదు.. బులెట్ ట్రైన్‌లా దూసుకెళ్తున్నాం..

బుల్డోజర్లతో విధ్వంసమే కాదు.. మంచి పనీ చేయొచ్చు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 15 , 2025 | 05:16 PM