Share News

Nara Lokesh Tata Hitachi: బుల్డోజర్లతో విధ్వంసమే కాదు.. మంచి పనీ చేయొచ్చు

ABN , Publish Date - Oct 15 , 2025 | 02:10 PM

ప్రజలు తనకిచ్చిన మెజారిటీతోనే ఎక్కడా లేని అభివృద్ధి పనులు మంగళగిరిలో జరుగుతున్నాయని మంత్రి లోకేష్ తెలిపారు. మంగళగిరిలో జెమ్స్ అండ్ జ్యూవలరీ పార్క్ అభివృద్ధిపై దృష్టి సారించామని చెప్పారు.

Nara Lokesh Tata Hitachi: బుల్డోజర్లతో విధ్వంసమే కాదు.. మంచి పనీ చేయొచ్చు
Nara Lokesh Tata Hitachi

అమరావతి, అక్టోబర్ 15: మంగళగిరిలో టాటా గ్రూప్‌కు చెందిన హిటాచి షోరూంను మంత్రి నారా లోకేష్ (Minister Lokesh) ఈరోజు (బుధవారం) ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం బుల్డోజర్లను విధ్వంసానికి వినియోగిస్తే... ప్రజా ప్రభుత్వం అభివృద్ధికి వాడుతోందన్నారు. బుల్డోజర్లతో విధ్వంసమే కాదు మంచి పనులు కూడా చేయవచ్చని చూపించే ప్రభుత్వం ఇది అని వెల్లడించారు. ప్రభుత్వంలో మంగళగిరి నియోజకవర్గం పని అంటే కాదనే వారు లేరన్నారు మంత్రి.


ప్రజలు తనకిచ్చిన మెజారిటీతోనే ఎక్కడా లేని అభివృద్ధి పనులు మంగళగిరిలో జరుగుతున్నాయని తెలిపారు. మంగళగిరిలో జెమ్స్ అండ్ జ్యువెల్లరీ పార్క్ అభివృద్ధిపై దృష్టి సారించామని చెప్పారు. టాటా హిటాచీతో పాటు ఇతర అనుబంధ సంస్థలను లక్ష్మీ గ్రూప్ మంగళగిరిలో ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ కోరారు.


యువతను ఆదుకునే దిశగా..: కంభంపాటి

రాష్ట్రానికి ఎప్పుడూ లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో పెట్టుబడులు వస్తున్నాయని తెలుగుదేశం సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావు అన్నారు. యువతను ఆదుకునే దిశగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని తెలిపారు. ఎన్టీఆర్ ఇచ్చిన ప్రోత్సాహంతోనే లక్ష్మీ గ్రూప్ విస్తరించి 6 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిందని వెల్లడించారు. టాటాతో పాటు హుండాయ్ షో రూమ్‌లను లక్ష్మీ గ్రూప్ నిర్వహిస్తోందని కంభంపాటి రామ్మోహన్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

కదులుతున్న రైల్లో అమానుష ఘటన.. ఒంటరిగా ఉన్న మహిళపై....

డబుల్ ఇంజిన్ కాదు.. బులెట్ ట్రైన్‌లా దూసుకెళ్తున్నాం..

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 15 , 2025 | 04:41 PM