Crime In Train: కదులుతున్న రైల్లో అమానుష ఘటన.. ఒంటరిగా ఉన్న మహిళపై..
ABN , Publish Date - Oct 15 , 2025 | 09:36 AM
ఏపీలోని గుంటూరు రైల్వే స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. చర్లపల్లి వెళ్తున్న మహిళ.. గుంటూరులో రైలెక్కింది. అయితే రైలు రన్నింగ్‌లో ఉండగా.. ఆమెకు షాకింగ్ అనుభం ఎదురైంది. గుర్తుతెలియని ఓ వ్యక్తి సదరు మహిళను టార్గెట్ చేశాడు. పక్కన ఎవరూ లేని సమయంలో..
మహిళలపై దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మొన్నటిదాకా ఒంటరిగా కనిపించే మహిళపై దాడులు చేయడం చూశాం. కానీ రోజు రోజుకూ కామాంధులు పేట్రేగిపోతున్నారు. బహిరంగ ప్రదేశాల్లోనూ మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలను నిత్యం చూస్తూనే ఉన్నాం. తాజాగా, గుంటూరులో కదులుతున్న రైల్లో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే..
ఏపీలోని (Andhra Pradesh) గుంటూరు రైల్వే స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. చర్లపల్లి వెళ్లేందుకు ఓ మహిళ రైలెక్కింది. రైలు సత్రగంజ్ నుంచి చర్లపల్లి వెళ్తున్న సమయంలో ఆమెకు షాకింగ్ అనుభం ఎదురైంది. గుర్తుతెలియని ఓ వ్యక్తి సదరు మహిళను టార్గెట్ చేశాడు. పక్కన ఎవరూ లేని సమయంలో చూసి సమీపానికి వచ్చాడు. ఆమె ఫోన్, బ్యాగు లాక్కు్న్నాడు. కత్తి చూపించి చంపేస్తా.. అంటూ బెదింరించి అత్యాచారయత్నం చేయబోయాడు. వెంటనే ఆమె కేకలు పెట్టడంతో అతను భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
190 కొత్త 108 వాహనాలను త్వరలో ప్రారంభిస్తాం: మంత్రి సత్యకుమార్
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..