MLA Vasanth: జోగి... జగన్ జేబులో మనిషి
ABN , Publish Date - Oct 15 , 2025 | 06:39 AM
కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు.
కల్తీ మద్యం కేసులో ఇద్దరినీ అరెస్టు చేయాలి: ఎమ్మెల్యే వసంత
అమరావతి, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘జోగి రమేశ్ ఓ అసాంఘిక శక్తి. చంద్రబాబుకు చెడ్డపేరు తెచ్చేందుకు తన చిన్ననాటి స్నేహితుడైన అద్దేపల్లి జనార్దన్‌తో కలసి కల్తీ మద్యం డ్రామాను నడిపించాడు. సెప్టెంబరు 24న ఆఫ్రికాకు వెళ్లాల్సిన జనార్దన్ రావు 23 సాయంత్రం గంటపాటు జోగి రమేశ్ ఇంటికి వెళ్లి ఏం మాట్లాడారు? జోగి రమేశ్ ఇంటి సీసీ కెమెరాలను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తే నిజాలు వెలుగు చూస్తాయి. తంబళ్లపల్లి, ములకలచెరువులో కల్తీ మద్యం గురించి జోగి రమేశ్ అనుచరుడు సురేశ్ ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అంతా పక్కా ప్లాన్ ప్రకారం చేసి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. జగన్ డైరెక్షన్‌లో జోగి రమేశ్, జనార్దన్‌రావు కల్తీ మద్యం వ్యాపారం చేశారు. జగన్‌ను, జోగి రమేశ్‌ను అరెస్టు చేస్తే ఈ కేసులో వాస్తవాలు వెలుగు చూస్తాయి’ అని ఎమ్మెల్యే వసంత అన్నారు.