Chevireddy Bhaskar Reddy: చెవిరెడ్డి బెయిల్‌పై విచారణ.. సుప్రీం కీలక నిర్ణయం
ABN , Publish Date - Oct 15 , 2025 | 12:26 PM
మద్యం కేసు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి బెయిల్‌పై సుప్రీంకోర్టు క్లారిఫికేషన్ ఇచ్చింది. మద్యం కేసులో మిగతా నిందితులతో సంబంధం లేకుండా వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి బెయిల్‌పై నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 15: మద్యం కేసు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి బెయిల్‌పై సుప్రీంకోర్టు క్లారిఫికేషన్ ఇచ్చింది. మద్యం కేసులో మిగతా నిందితులతో సంబంధం లేకుండా వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి బెయిల్‌పై నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్‌పై తుది నిర్ణయం తీసుకునేంత వరకు ట్రయల్ కోర్టు మిగతా వారి బెయిల్ పిటిషన్లపై నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది.
దీంతో హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టులో చెవిరెడ్డి భాస్కరరెడ్డి సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి పిటిషిన్‌పై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఆ క్రమంలో చెవిరెడ్డి బెయిల్ పై విచారించి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏబీఎన్ ఎఫెక్ట్.. స్పందించిన ప్రభుత్వం.. తీరనున్న ఉల్లి రైతు కష్టాలు..
మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్.. 27 మంది లొంగుబాటు
For More AP News And Telugu News