Share News

ABN Effect: ఏబీఎన్ ఎఫెక్ట్‌.. స్పందించిన ప్రభుత్వం.. తీరనున్న ఉల్లి రైతు కష్టాలు..

ABN , Publish Date - Oct 15 , 2025 | 10:06 AM

కర్నూలు జిల్లా ఉల్లి రైతులకు ఇప్పటికే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

ABN Effect: ఏబీఎన్ ఎఫెక్ట్‌.. స్పందించిన ప్రభుత్వం.. తీరనున్న ఉల్లి రైతు కష్టాలు..

కడప, అక్టోబర్ 15: ఉల్లి పంటకు సరైన గిట్టుబాటు ధర లేక ఉమ్మడి కడప జిల్లా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రైతు సమస్యలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలు ప్రసారం చేసింది. దాంతో కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించింది. కర్నూలు జిల్లాలోని ఉల్లి రైతులకు అందిస్తున్న ప్యాకేజీ కడప జిల్లాలోని రైతులకు సైతం వర్తించేలా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో కడప జిల్లాలోని ఉల్లి రైతులకు కూడా హెక్టారుకు రూ.50 వేలు ధర అందనుంది. ఈ మేరకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన ఉతర్త్వులను ప్రభుత్వం మరికొన్ని గంటల్లో జారీ చేయనుంది.


ఆంధ్రప్రదేశ్‌లో ఉల్లి పంటను రాయలసీమలోని కర్నూలు జిల్లాలో అత్యధిక భాగం సాగు చేస్తారన్న సంగతి అందరికి తెలిసిందే. అలాగే కడప జిల్లాలో సైతం ఈ పంటను రైతులు పండిస్తారు. అయితే ఈ ఏడాది మార్కెట్‌లో ఉల్లికి ధర లేకుండా పోయింది. దీంతో సాగు చేసిన రైతులు ఈ పంటను రహదారులు, కాల్వల్లో పడేశారు. అందుకు సంబంధించిన చిత్రాలు, వార్తా కథనాలు మీడియాలో సోషల్ మీడియాలో సైతం వైరల్ అయినాయి. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా అధికారులు రంగంలోకి దిగి ఉల్లి రైతుల కోసం మద్దతుగా చర్యలు చేపట్టారు.


అయితే వైపరీత్యాల నిధుల కింద కేంద్ర ప్రభుత్వం హెక్టారుకు రూ. 17, 500 ఇస్తుంది. అందుకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం హెక్టారుకు రూ. 32, 500 మంజూరు చేయనుంది. ఈ నగదు మొత్తం రూ. 50 వేల సాయం రైతుల ఖాతాల్లోకి జమ కానుంది. అంటే ఉల్లి పంట ఎంత ధరకు విక్రయించినా.. ఈ సాయం రైతులకు అందనుంది. ఇంకోవైపు కర్నూలు జిల్లాలో ఉల్లి పంట సాగు చేసిన రైతుల వివరాలకు సంబంధించిన సర్వేను ఇప్పటికే ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ డేటా ఆధారంగా అర్హులైన ఉల్లి రైతులకు ఈ సాయం అందించనుంది. అదే విధంగా కడప జిల్లాలోని ఉల్లి రైతులకు సైతం ఇదే పద్దతిని ప్రభుత్వం అనుసరించనుంది.


ఉల్లి కిలో ధర చాలా స్వల్పంగా ఉండడంతో.. రైతులకు పెట్టుబడులు సైతం తిరిగి పొందలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రభుత్వ సాయం అందడంతో ఉల్లి రైతులకు ఉపశమనం లభించనుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్.. 27 మంది లొంగుబాటు

దీపావళి వేళ.. గ్రీన్ క్రాకర్స్‌పై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం

For More AP News And Telugu News

Updated Date - Oct 15 , 2025 | 01:19 PM