BIG BREAKING: దీపావళి వేళ.. గ్రీన్ క్రాకర్స్‌పై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం
ABN , Publish Date - Oct 15 , 2025 | 10:58 AM
దేశ రాజధాని న్యూఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్‌కు అనమతిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది.దీపావళి వేళ.. నాలుగు రోజుల పాటు గ్రీన్ క్రాకర్స్ కాల్చుకునేందుకు అనుమతి ఇచ్చింది. అక్టోబర్ 18 నుంచి 21వ తేదీ వరకు ఈ గ్రీన్ క్రాకర్స్ కాల్చుకునేందుకు అనుమతి ఇస్తూ సూప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 15: దేశ రాజధాని న్యూఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్‌కు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి, న్యాయమూర్తి జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఈ తీర్పు వెలువరించింది. దీపావళి వేళ.. నాలుగు రోజుల పాటు ఈ గ్రీన్ క్రాకర్స్ కాల్చుకునేందుకు అనుమతి ఇచ్చింది. అక్టోబర్ 18 నుంచి 21వ తేదీ వరకు ఈ గ్రీన్ క్రాకర్స్ కాల్చుకో వచ్చని అనుమతి ఇచ్చింది. ఈ మేరకు సూప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
ఈ గ్రీన్ క్రాకర్స్ కాల్చుకునేందుకు సాయంత్రం 6 నుంచి రాత్రి 10.00 గంటల సమయంలోపే కాల్చుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే ఈ కామర్స్ వెబ్ సైట్లు లేదా ఆన్ లైన్‌లో వీటిని కోనుగోలు చేయడంపై నిషేధం విధించింది. కేవలం అనుమతించిన క్యూఆర్ కోడ్ ఉన్న గ్రీన్ క్రాకర్స్ మాత్రమే వినియోగిస్తున్నారా? లేదా? అనే అంశాన్ని పరిశీలించాలని పోలీస్ ఉన్నతాధికారులకు కీలక సూచన చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి నోటీసులు జారీ చేయాలని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ.. ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాణ సంచాల విక్రయంపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. ఈ నిర్ణయంపై పలు రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ముఖ్యంగా దీపావళి వేళ పిల్లలు కోసం పర్యావరణ హితమైన బాణసంచాతో పండగ జరుపుకోనేందుకు అనుమతించాలని న్యాయ స్థానాన్ని కోరాయి. దీంతో సుప్రీంకోర్టు ధర్మాసనం పైవిధంగా తీర్పు వెలువరించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏబీఎన్ ఎఫెక్ట్.. స్పందించిన ప్రభుత్వం.. తీరనున్న ఉల్లి రైతు కష్టాలు..
మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్.. 27 మంది లొంగుబాటు
For More National News And Telugu News