Maoist Party: మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్.. 27 మంది లొంగుబాటు
ABN , Publish Date - Oct 15 , 2025 | 12:29 PM
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో 27 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు ప్రకటించారు. వీరిపై రూ.50లక్షల రివార్డు ఉంది.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 15: మావోయిస్టు పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో 27 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు ప్రకటించారు. వీరిపై రూ.50లక్షల రివార్డు ఉంది. కాసేపటి క్రితమే సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో, సెంట్రల్ మిలిటరీ కమిషన్ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌రావు అలియాస్ అభయ్ అధికారికంగా పోలీసులకు లొంగిపోయారు. మహారాష్ట్రలో ఈ మేరకు మల్లోజులను పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సమక్షంలో ఆయన ఆయుధాలు అప్పగించారు.