Share News

జనసేన 'క్రియాశీలక సభ్యత్వ నమోదు' ప్రారంభించిన పవన్ కల్యాణ్

ABN , Publish Date - Feb 15 , 2026 | 01:11 PM

జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ముందడుగు వేశారు. ఆదివారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘క్రియాశీలక సభ్యత్వ నమోదు’ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

జనసేన 'క్రియాశీలక సభ్యత్వ నమోదు' ప్రారంభించిన పవన్ కల్యాణ్
Jana Sena Active Membership

మంగళగిరి: జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేదిశగా ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) కీలక ముందడుగు వేశారు. ఫిబ్రవరి 15న ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘క్రియాశీలక సభ్యత్వ నమోదు’ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారాయన. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ స్వయంగా మొదటి సభ్యత్వాన్ని తీసుకోవడమే కాకుండా.. సభ్యత్వ నమోదు(Membership Registration) ప్రక్రియ కోసం తన వంతుగా రూ.2 కోట్ల భారీ విరాళాన్ని పార్టీకి అందజేశారు పవన్.


పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకుని.. పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు ఎవరైతే ముందుకు వచ్చి పార్టీ సభ్యత్వం తీసుకుంటారో వారిని ‘ఉద్యమి’గా పిలుస్తామన్నారు. పార్టీ పోరాటానికి మరింత బలాన్ని అందించి, నవతరంలో ప్రేరణ కలిగించి పార్టీ సిద్ధాంతాలకి ఆకర్షితులను చేసి సభ్యత్వ నమోదు చేసేవారిని ‘సాధక్’గానూ, జనసేన పార్టీ చేస్తున్న ప్రజా, రాజకీయ పోరాటానికి పరోక్షంగా తమ వంతు సమయాన్ని, ఆర్థిక, సాంకేతిక, సేవా, మేథా సహాయ సహకారాలు అందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసేవారిని ‘ప్రదాత’గా పిలుస్తామని ప్రకటించారు పవన్ కల్యాణ్.


ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ‘జనసేన పార్టీని 150 మందితో పార్టీని ప్రారంభించాం. 2021లో మొదటి విడత క్రియాశీలక సభ్యత్వం ప్రారంభించినప్పుడు 90 వేల పేర్లు నమోదు చేశాం. ఎన్నికలకు ముందు ఆ సంఖ్య 6 లక్షలకు చేరింది. ఎన్నికల తర్వాత 12.98 లక్షల సభ్యత్వాలు సాధించాం. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారి నుంచి కూలీ పనులు చేసుకునే వారు, చదువుకున్న వారు.. ఇలా ఎంతో మంది ఈ ప్రక్రియలో భాగస్వాములయ్యారు. పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకుని, పార్టీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారు మనకు ముఖ్యం. అలాంటి వారే పార్టీకి అవసరం’ అని చెప్పారు. కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్, పిడుగు హరిప్రసాద్ తదితర నేతలు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

‘నేనే రాజు.. నేనే మంత్రి..’ అదే నిజమా..!

గుమ్మడి నర్సయ్యకు గౌరవ డాక్టరేట్‌

Read Latest Telangana News and National News

Updated Date - Feb 15 , 2026 | 01:27 PM