Home » TDP Mahanadu
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి జగన్ అని విమర్శించారు.
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ప్రధాని మోదీ పిలుపుతో ఇంధన పొదుపు చర్యలకు అనుగుణంగా టీడీపీ నాయకత్వం చేపట్టిన ‘హైబ్రిడ్’ మహానాడు విజయవంతమైంది.
పార్టీలోనైనా..ప్రభుత్వంలోనైనా సంస్కరణలు తీసుకురావడంలో ముందుంటామని జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి లోకేశ్ అన్నారు.
రాష్ట్రంలో గొడ్డలి పార్టీ నేరాలు, ఘోరాలు చేస్తోంది. రాజకీయాల్లో ఇలాంటి వాటిని నేనెప్పుడూ ఊహించలేదు. బాబాయిని హత్య చేసి నా చేతికే మరక అంటించే ప్రయత్నం చేశారు.
నిర్లక్ష్యానికి గురైన సాగునీటి ప్రాజెక్టులకు పునరుజ్జీవం పోసిన అపర భగీరథుడు చంద్రబాబు అని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ అన్నారు.
సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు దూరదృష్టి అమోఘమని మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. నీటిపారుదల అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వాలే పునాది వేశాయని పేర్కొన్నారు. జలం ఉన్న చోటే నాగరికత అభివృద్ధి చెందిందని తెలిపారు.
ఎన్టీఆర్ ఏ చిత్రం తీసినా 300 రోజులు ఆడేవని.. ఆ రోజుల్లోనే రాజకీయాల్లోకి వచ్చారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. సమస్యలు ఎదుర్కొని నీతివంతమైన పరిపాలన సాగించారన్నారు. నెల రోజుల్లో ఇందిరా గాంధీని ఎదిరించి అధికారంలోకి వచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.
టీడీపీ మహానాడు రెండో రోజు ఘనంగా ప్రారంభమైంది. షెడ్యూల్ కంటే 20 నిమిషాల ముందే కార్యక్రమం మొదలైంది.
పార్లమెంటులో మహిళా బిల్లు పెడితే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. మన స్త్రీ శక్తికి మరింత బలం ఇవ్వాలని చూస్తే దానికి ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయి.
తెలుగుదేశం పార్టీ ఎన్నికల కోసం పనిచేయదు.. భవిష్యత్ తరాల కోసం, వారికి బంగరు భవిత అందించడానికి పనిచేస్తుందని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.