Share News

యువతకు బంగారు భవిత!

ABN , Publish Date - May 28 , 2026 | 04:57 AM

తెలుగుదేశం పార్టీ ఎన్నికల కోసం పనిచేయదు.. భవిష్యత్‌ తరాల కోసం, వారికి బంగరు భవిత అందించడానికి పనిచేస్తుందని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

యువతకు బంగారు భవిత!

  • మేం పనిచేసేది భవిష్యత్‌ తరాల కోసం.. ఎన్నికల కోసం కాదు: చంద్రబాబు

  • గొడ్డలి పార్టీకి గోల్‌ లేదు.. అంతా అడ్డగోలే

  • వేట కొడవళ్ల నుంచి గొడ్డలికి మారడమే వారి విధానం

  • ఐటీ నుంచి క్వాంటమ్‌కు ఎదగడం మన విధానం

  • తొలి రోజు టీడీపీ అధినేత ప్రసంగం

అమరావతి, మే 27(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ ఎన్నికల కోసం పనిచేయదు.. భవిష్యత్‌ తరాల కోసం, వారికి బంగరు భవిత అందించడానికి పనిచేస్తుందని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ‘ప్రస్తుతం యువతకు కావలసింది ఉద్యోగా లు.. ఉపాధి అవకాశాలే గానీ.. గొడ్డలి పోట్లు కాదు. పేదలకు కావలసింది సంక్షేమం.. గొడ్డలి వేట్లు కాదు. రక్తాభిషేకాలు చేసేవారు స్వర్ణాంధ్ర చరిత్రను లిఖించలేరు.. అందుకే గొడ్డలి పార్టీ నెవర్‌ అగైన్‌’ అని ప్రజల కు పిలుపిచ్చారు. వేట కొడవళ్ల నుంచి గొడ్డలి పార్టీగా మారడం వారి విధానమైతే.. ఐటీ నుంచి క్వాంటమ్‌ దిశగా ఎదగడం మన విధానమని.. రెండూ ఒకటి కాదు(బోత్‌ ఆర్‌ నాట్‌ సేమ్‌) అని స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవా రం జరిగిన మహానాడులో చంద్రబాబు ప్రసంగించా రు. టీడీపీ తొలి నుంచీ మహిళల సాధికారత కోసం, యువత భవిత కోసమే పనిచేస్తూ వస్తోందన్నారు. ఏ పాలసీ అయినా యువత కోసమే చేస్తున్నామని తెలిపారు. ‘ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ పాలసీతో యువతకు ఉద్యోగాలు వచ్చాయి. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ లోకేశ్‌ యువగళం పాదయాత్రలో యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. జెన్‌ జీ, జెన్‌ ఆల్ఫా, టీనేజర్ల ఆలోచనలకు అనుగుణంగా విధానాలు రూ పొందిస్తాం. ఇది నవీన ఆలోచనల సమయం. యువతకు ఉద్యోగాలు. ఉపాధి అవకాశాల కల్పనలో వారి కంటే ముందే ఆలోచన చేస్తున్నాం. ఏ రంగమైనా.. ఏపీయే చిరునామా’ అని తెలిపారు. అగ్రెసివ్‌గా.. ప్రోగ్రెసివ్‌గా ముందుకెళ్తున్నామన్నారు. గొడ్డలి పార్టీకి గోల్‌ లేదని.. అంతా అడ్డగోలుతనమేనని ధ్వజమెత్తా రు. గత పాలకులు ఐదేళ్లలో రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తే.. కూటమి వచ్చిన రెండేళ్లలోనే రాష్ట్రాన్ని గాడిలో పెట్టామన్నారు. చంద్రబాబు ఇంకా ఏం చెప్పారంటే..


తగ్గింది వాహనాల హోరే..

వర్చువల్‌ మహానాడు కారణంగా వాహనాల హో రు తగ్గిందేమో గానీ.. కార్యకర్తల్లో జోరు తగ్గలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని క్లస్టర్లను అనుసంధానించి మహానాడును నిర్వహించుకుంటున్నాం. పశ్చిమాసియాలో యుద్ధం వల్ల హైబ్రిడ్‌ పద్ధతిలో నిర్వహించుకుంటున్నాం. మీటింగ్‌ మోడల్‌ మారిందే తప్ప.. మహా నాడు విధానం మారలేదు. కూడు, గూడు, గుడ్డ నినాదంతో ఆవిర్భవించిన టీడీపీ.. విజన్‌ పాలిటిక్స్‌కు రూపం ఇచ్చింది. జాతీయ జెండా దేశానికి గౌరవం.. పసుపు జెండా తెలుగువారి గౌరవం.. ఆత్మవిశ్వాసం. నాటికీ నేటికీ పార్టీపై ప్రజాదరణ చెక్కు చెదరలేదు. 45 ఏళ్లుగా ప్రజాసమస్యల కోసం పోరాటం చేస్తూనే ఉంది. నరహంతకులు పీకలు కోస్తున్నా, టీడీపీ కార్యకర్తలు పార్టీ జెండాను వీడలేదు. తనను నరుకుతున్నా చంద్రయ్య జై చంద్రబాబు, జై తెలుగుదేశం అంటూ నినదించి అమరుడయ్యారు. నన్ను కూడా అక్రమంగా జైల్లో పెట్టారు. లోకేశ్‌ యువగళాన్ని అడ్డుకున్నారు. ఎందరో నేతలను అరెస్టు చేశారు. బాధితులనే నిందితులుగా చేసినా ఏ టీడీపీ నాయకుడూ, కార్యకర్తా వె నుకడుగు వేయలేదు. కొడిగడుతున్న ప్రజాస్వామ్యా న్ని బతికించేందుకు 2024లో బీజేపీ, జనసేనతో కలిసి కూటమిగా ఏర్పడ్డాం. ప్రజలు ఆశీర్వదించారు.

పసుపు పండగను డైవర్ట్‌ చేసేందుకు..

మహానాడుని డైవర్ట్‌ చేసేందుకు గొడ్డలి పార్టీ కుట్ర లు చేస్తోంది. ఎన్ని కుట్రలు చేసినా.. ఎన్ని కుయక్తులు పన్నినా టీడీపీని అడ్డుకోలేరు. ఏదైనా పార్టీ ఫస్ట్‌.. క్యాడరే బెస్ట్‌. నాయకులను తయారు చేసే విశ్వవిద్యాలయం టీడీపీ. సోషల్‌ రీ-ఇంజనీరింగే మన విధానం. కార్యకర్తల సంక్షేమం కోసం రూ.160 కోట్లు ఖర్చు చేశాం. స్పెషల్‌ రివిజన్‌(సర్‌)లో భాగంగా ఓట్ల నమోదు విషయంలో నేతలు, కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలి. ఎవరూ ఇగోలకు వెళ్లొద్దు. మహానాడు సాక్షిగా తెలుగుజాతి కోసం పునరంకితమవుదాం.


వైసీపీకి రాజధానిపై విజన్‌ లేదు..

అభివృద్ధి చేసి సంపద సృష్టించలేని వారికి సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదు. వైసీపీకి రాజధానిపై ఓ విజన్‌ అంటూ లేదు. ఆ పార్టీకి విషం కక్కడమే తెలుసు. అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానులన్నారు.. ఇప్పుడు మావిగన్‌ అం టున్నారు. వాళ్లకు ఎలాంటి గోల్‌ లేదు.. అది ఓ అడ్డగోలు బ్యాచ్‌. వైసీపీది ఓ బ్లఫ్‌ బ్యాచ్‌. ఫేక్‌ న్యూస్‌ బ్యాచ్‌. గత పాలకులు రూ.32 వేల కోట్ల విద్యుత్‌ భారాన్ని ప్రజలపై వేశారు. రూ.1.35 లక్షల కోట్ల మేర డిస్కంలను అప్పుల్లో ముంచారు. విద్యుత్‌ చార్జీలు పెంచబోమని చెప్పాం. తొలిసారి ట్రూ డౌన్‌ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే. గత పాలకులు 85 లక్షల టన్నుల చెత్తను వదిలి వెళ్తే దానినీ తొలగించాం. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టును రద్దు చేశాం. ఆక్వా ధరలు పడిపోయాయి. ఈ సం క్షోభాన్ని పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నాం.

మహానాడు మహిళలకే అంకితం

మహిళా సాధికారత కోసం, సామాజిక ఆర్థిక రాజకీయ గౌరవం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తోంది. ఆస్తి హక్కు నుంచి నేడు తల్లికి వందనం వరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఘనత టీడీపీదే. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు టీడీపీ వారి వెనుక ఉంటుంది. స్త్రీశక్తి ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. దీపం 2.0 ద్వారా ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇస్తున్నాం. గత ఏడా ది లక్ష మంది మహిళలను ఎంట్రప్రెన్యూర్లుగా త యారు చేశాం. 2024 ఎన్నికల్లో కూటమి విజయంలో మహిళలదే కీలక పాత్ర. అందుకే ఈ మహానాడును మహిళా మహానాడుగా ప్రకటిస్తున్నాం.


రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ..

కూటమి ప్రభుత్వం వచ్చిన 23 నెలల్లో రాష్ట్రానికి రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. తద్వారా 23 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశముంది. ఇప్పటికే 282 ప్రాజెక్టుల ద్వారా రూ.11.27 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎస్‌ఐపీబీ ద్వారా ఆమోదం తెలిపాం. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ కాదు.. గేర్‌ మార్చి స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ద్వారా పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇస్తున్నాం. కేవలం 36 రోజుల్లో నే ఫైటర్‌ జెట్‌ తయారీ, టెస్టింగ్‌ ప్రాజెక్టుకు అనుమతులిచ్చాం. ఆ స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినె్‌సతోనే తిరుపతిలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ ప్రాజెక్టు వచ్చింది. 23 నెలల్లో రూ.63 వేల కోట్లకుపైగా మొత్తాన్ని పింఛన్ల కోసం ఖర్చు పెట్టాం. ఇది సంక్షేమంలోనే రికార్డు. కొత్తగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ఆక్వా రైతులకు జూన్‌ 1 నుంచి యూనిట్‌ విద్యుత్‌ రూ.1.50కే ఇవ్వాలని ఆదేశాలిచ్చాం. దివ్యాంగ శక్తి పేరిట ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం. ప్రజారోగ్యంలో సంజీవని ప్రాజెక్టుతో వినూత్న మార్పు తీసుకొ చ్చాం. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తిగత ఆరోగ్యం, పరిరక్షణ కోసం డిజిటల్‌ హెల్త్‌ రికార్డుల కార్యక్రమం ‘సంజీవని’ అమలు చేస్తాం. మెగా డీఎస్సీ ద్వారా 15,941 మందికి టీచర్‌ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదే. 5757 మంది కానిస్టేబుళ్లను రిక్రూట్‌ చేసిన ప్రభుత్వం మనది. 2026 జాబ్‌ క్యాలెండర్‌ను కూడా విడుదల చేశాం. విద్యలో రాష్ట్రాన్ని రోల్‌ మోడల్‌గా నిలుపుతున్నాం. సాగునీటి రంగానికి ప్రాధాన్యమిస్తూ.. 36 ప్రాధాన్య ప్రాజెక్టుల పూర్తికి క్యాలెండర్‌ను కూడా ప్రకటించాం. పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల కంటే ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. గత పాలకుల నిర్లక్ష్యంతో డయాఫ్రం వాల్‌ ధ్వంసం కావడంతో తిరిగి రూ.1000 కోట్లతో కొత్త వాల్‌ నిర్మాణం పూర్తి చేశాం.

  • ఆకాశమే హద్దుగా రాష్ట్ర యువత అవకాశాలను వినియోగించుకోవాలి. ‘వన్‌ ఫ్యామిలి-వన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌’ ద్వారా అవకాశాలను వాడుకోవాలి.

  • చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్‌ సాధించే వరకు వారి వెన్నంటే ఉంటాం. మహిళల పోరాటాలకు ఈ మహానాడు అంకితం.

  • రైతులను.. వ్యవసాయాన్ని గత పాలకులు నిర్వీర్యం చేశారు. వారికి ఏడాదికి రూ.7,500 మాత్రమే ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏటా రూ.14 వేలను అన్నదాతా సుఖీభవ కింద ఇస్తున్నాం.

  • తీరం మనదే.. బోటు మనదే.. వేటా మనదే అనేలా చర్యలు చేపట్టాం. 200 మెకనైజ్డ్‌ బోట్లను రూ.240 కోట్ల సబ్సిడీపై ఇస్తాం. - సీఎం చంద్రబాబు

0.jpg6.jpg5.jpg10.jpg8.jpg

Updated Date - May 28 , 2026 | 04:57 AM