కార్యకర్తలు, నాయకులకు మనోధైర్యం చంద్రబాబు, లోకేశ్: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
ABN , Publish Date - May 28 , 2026 | 12:23 PM
ఎన్టీఆర్ ఏ చిత్రం తీసినా 300 రోజులు ఆడేవని.. ఆ రోజుల్లోనే రాజకీయాల్లోకి వచ్చారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. సమస్యలు ఎదుర్కొని నీతివంతమైన పరిపాలన సాగించారన్నారు. నెల రోజుల్లో ఇందిరా గాంధీని ఎదిరించి అధికారంలోకి వచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.
అమరావతి, మే 28: రెండో రోజు టీడీపీ మహానాడు కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో 44 ఏళ్ల టీడీపీ ప్రస్థానంపై ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రసంగించారు. ‘ఎన్టీఆర్ మాకు, మనకు ఆరాధ్య దైవం. రాజకీయాల్లోకి వద్దామని అనుకుంటున్నా అని ఎన్టీఆర్ హింట్ ఇచ్చేవారు. 1982 మార్చి 28న ఆదర్స్ నగర్‌లో ప్రకటన చేశారు. పెద్ద పెద్ద వాళ్లు ఎవరు రాలేదు. సామాన్యులు మాత్రమే ఎన్టీఆర్‌కి అండగా నిలిచారు. పేదవాడు అంబలి ఇస్తే తాగేవాడు ఎన్టీఆర్. 7 నెలల పాటు తుఫాను, ఎండలు ఉన్నా ఎన్టీఆర్ పాదయాత్ర చేశారు. 9 నెలల్లో అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించారు’ అని తెలిపారు.
ఎన్టీఆర్ ఏ చిత్రం తీసినా 300 రోజులు ఆడేవని.. ఆ రోజుల్లోనే రాజకీయాల్లోకి వచ్చారని గోరంట్ల బుచ్చయ్య అన్నారు. సమస్యలు ఎదుర్కొని నీతివంతమైన పరిపాలన సాగించారన్నారు. నెల రోజుల్లో ఇందిరా గాంధీని ఎదిరించి అధికారంలోకి వచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. శ్రీశైలం ప్రాజెక్ట్‌ను సాగు, తాగునీరు ఇచ్చే విధంగా తెలుగు గంగకు శ్రీకారం చుట్టారన్నారు. మిగులు జలాల పేరుతో తెలుగు గంగను వైఎస్‌ఆర్ అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఎన్టీ రామారావుపై అవినీతి ఆరోపణలు చేసి కోర్టుకు రాకుండా వైఎస్‌ఆర్ పారిపోయారని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ పెట్టిన పథకాలను దేశమే ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగిందని చెప్పుకొచ్చారు.
విజన్ 2020తో రాష్ట్ర గతిని, స్థితిని మార్చిన నాయకుడు చంద్రబాబు అని గోరంట్ల అన్నారు. ఇంత ఎండల్లో మహానాడు సాధ్యమేనా అని అనుమానం కలిగిందని.. వర్చువల్‌గా 7.5 లక్షల మంది కలిసేలా టెక్నాలజీని వినియోగించి చూపించిన నేత లోకేశ్ అని కొనియాడారు. దేశానికే దిక్సూచిగా లోకేశ్ మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. పులి కడుపున పులే పుడుతుందని... పెద్ద పులి సాధువు... చిన్న పులి ఉగ్రనరసింహమన్నారు. ఈ ఉగ్రనరసింహం దెబ్బకు గొడ్డలి పార్టీ పరార్ అంటూ వ్యాఖ్యానించారు. తెలుగు జాతి ఐక్యత కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం ప్రధాన పాత్ర పోషిస్తున్న నేత లోకేశ్ అని తెలిపారు. మహిళలకు కేంద్రం ఇచ్చినా ఇవ్వకున్నా 33 శాతం రిజర్వేషన్లు ఇస్తామనడం అభినందనీయమన్నారు. కార్యకర్తలకు, నాయకులకు మనోధైర్యం చంద్రబాబు, లోకేశ్ అని చెప్పారు. ఎన్టీఆర్.. కాంగ్రెస్‌ను మట్టి కరిపించారనే అక్కసుతో పద్మభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, భారతరత్న ఇవ్వలేదని విమర్శించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అన్న ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చేలా కృషి చేద్దామని గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
వడదెబ్బ బాధితుల కోసం కేజీహెచ్‌లో ప్రత్యేక వార్డు: డాక్టర్ వాణి
గాయపడిన సింహాన్ని.. మరింత కసితో వేటాడతా: అభినయ్ దర్శన్
Read Latest AP News And Telugu News